English | Telugu

వార్-2 టీజర్.. ఎన్టీఆర్ ని తక్కువంచనా వేశారు!

టాలీవుడ్ టాప్ స్టార్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. 'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ ఇమేజ్ కూడా సొంతం చేసుకున్నారు. అలాంటి ఎన్టీఆర్ తన బాలీవుడ్ ఎంట్రీని సోలో ఫిల్మ్ తో కాకుండా.. హృతిక్ రోషన్ తో కలిసి 'వార్-2'లో స్క్రీన్ షేర్ చేసుకోవడంపై అందరూ ఆశ్చర్యపోయారు. కొందరైతే అసలు ఎన్టీఆర్ నిర్ణయం సరైనదేనా అని సందేహాలు కూడా వ్యక్తం చేశారు. ఆ సందేహాలకు సమాధానం అన్నట్టుగా తాజాగా విడుదలైన వార్-2 టీజర్ ఉంది. (War 2 Teaser)

యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందుతోన్న 'వార్-2'లో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంతవరకు వార్-2 నుంచి ఒక్క అఫీషియల్ పోస్టర్ కూడా రాలేదు. హృతిక్ రోషన్ బర్త్ డేకి కూడా ఎలాంటి కంటెంట్ రిలీజ్ చేయలేదు. అలాంటిది ఈరోజు(మే 20) ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఏకంగా టీజర్ విడుదల చేశారంటే.. ఆయనకు టీం ఎంత ప్రాముఖ్యత ఇస్తుందో ఇక్కడే అర్థమవుతోంది.

నిమిషంన్నర నిడివి ఉన్న వార్-2 టీజర్.. యాక్షన్ ప్రియులను కట్టిపడేసేలా ఉంది. ఎన్టీఆర్ వాయిస్ తోనే ఈ టీజర్ ప్రారంభమవ్వడం విశేషం. "నా కళ్ళు నిన్ను ఎప్పటినుంచో వెంటాడుతూనే ఉన్నాయి కబీర్. ఇండియాస్ బెస్ట్ సోల్జర్, 'రా' బెస్ట్ ఏజెంట్.. నువ్వే. కానీ, ఇప్పుడు కాదు." అంటూ ఎన్టీఆర్ వాయిస్ తో హృతిక్ రోల్ ని ఇంట్రడ్యూస్ చేసిన తీరు ఆకట్టుకుంది. అలాగే "నీకు నా గురించి తెలీదు. ఇప్పుడు తెలుసుకుంటావు" అంటూ తన వాయిస్ తోనే ఎన్టీఆర్ పాత్రను చూపించిన తీరు అదిరిపోయింది.

ఇప్పటికే వార్ లో కబీర్ గా ఆకట్టుకున్న హృతిక్.. మరోసారి తన స్క్రీన్ ప్రజెన్స్ తో మ్యాజిక్ చేశాడు. ఇక ఎన్టీఆర్ కూడా హృతిక్ కి ధీటుగా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. యాక్షన్ సీన్స్ లో ఇద్దరూ అదరగొట్టారు. ఇద్దరి మధ్య బిగ్గెస్ట్ వార్ చూడబోతున్నాం అన్నట్టుగా టీజర్ ని కట్ చేసిన తీరు మెప్పించింది. విజువల్స్, మ్యూజిక్ అన్నీ టాప్ క్లాస్ లో ఉన్నాయి. నువ్వా నేనా అన్నట్టుగా హృతిక్-ఎన్టీఆర్ మధ్య యాక్షన్ సన్నివేశాలు కట్టిపడేశాయి. మొత్తానికి టీజర్ ని చూస్తుంటే.. హృతిక్ కి సమానమైన పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తున్నాడని, ఈ సినిమా తర్వాత స్టైలిష్ యాక్షన్ స్టార్ గా ఎన్టీఆర్ కి సరికొత్త ఇమేజ్ రావడం ఖాయమని అనిపిస్తోంది.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.