English | Telugu

రవితేజ, గుణశేఖర్ "నిప్పు" ఉగాదికి ప్రారంభం

రవితేజ హీరోగా, గుణశేఖర్ దర్శకత్వంలో "నిప్పు" చిత్రం ఉగాదికి ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకులు వై.వి.యస్. చౌదరి నిర్మించనున్నారు. రవితేజ హీరోగా, గుణశేఖర్ దర్శకత్వంలో "నిప్పు" చిత్రానికి "ది ఫైర్" అన్న క్యాప్షన్ ని నిర్ణయించారు. ఈ రవితేజ హీరోగా, గుణశేఖర్ దర్శకత్వంలో "నిప్పు" చిత్రంలో హీరోయిన్ ఎవరనేది ఇంకా తెలియరాలేదు. కొత్తమ్మాయి కోసం వెతుకుతున్నారనేది విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం.

గుణశేఖర్ ఈ చిత్రానికే గతంలో "కత్తి" అన్న పేరు పెడితే ఆ పేరుని నందమూరి కళ్యాణ్ రామ్ తన చిత్రానికి "కళ్యాణ్ రామ్ కత్తి" అని పెట్టుకోవటం, దాని మీద గుణశేఖర్ "ఇది అన్యాయం" అని ప్రెస్ మీట్ పెట్టి గగ్గోలు పెట్టటం జరిగింది. ఇప్పుడా చిత్రానికి "నిప్పు" అన్న పేరు పెట్టారు. కానీ ఈ నిప్పు, అగ్ని అని పేరు పెట్టిన సినిమాల్లో ఏవో కొన్ని తప్ప దాదాపు సగానికి పైగా ఫ్లాపయిన సినిమాలే ఉన్నాయి. మరి ఈ రవితేజ హీరోగా, గుణశేఖర్ దర్శకత్వంలో ప్రారంభమవుతున్న "నిప్పు" చిత్రం ఏమవుతుందో వేచి చూడాలి.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.