English | Telugu

శ్రీజ దెబ్బకి శిరీష్ భరద్వాజ్ విలవిల

మెగాస్టార్, పద్మభూషణ్, డాక్టర్ చిరంజీవి ద్వితీయ కుమార్తె శ్రీజ అందర్నీ కాదనుకుని శిరీష్ భరద్వాజని ప్రేమించి పెళ్ళాడింది. వారి ప్రేమ ఫలితంగా ఒక ఆడపిల్ల కూడా పుట్టింది. ఈ మధ్యే ఒక నెల రోజుల క్రితం శ్రీజ ఒక ఛానల్లో మాట్లాడుతూ శిరీష్ లాంటి భర్త దొరకటం తన అదృష్టమని కూడా చెప్పింది. కానీ ఇటీవల శ్రీజ తన భర్త శిరీష్ మీద తన భర్త కట్నం కోసం తనను మానసికంగా హింసిస్తూ బాధపెడుతున్నాడని పోలీస్ కేస్ పెట్టింది.

తమ పెళ్ళయిన దగ్గర నుండీ ఒక మంచి ఉద్యోగం చూసుకోమని శిరీష్ కి చెపుతున్నా దాని గురించి అతనేనాడూ ఆలోచించలేదనీ, తన పేరనున్న ఆస్తులను అమ్మమని తనను శిరీష్ బలవంతం పేట్టేవాడని చెప్పిందట. అందుకని తన పేరమీద ఉన్న ఆస్తిని తిరిగి తన తల్లిదండ్రుల పేర తిరిగి వ్రాశాననీ కూడా శ్రీజ తెలియజేసిందట. ఈ మధ్య అతను, అతని తల్లీ కలసి తనను 50 లక్షలు పుట్టింటి నుంచి తీసుకురమ్మని బలవంతం చేస్తున్నారనీ, ఆ డబ్బు తెచ్చే నెపం మీద అతన్నుండి బయటపడి ఇప్పుడీ పోలీస్ కేస్ పెడుతున్నాననీ కన్నీఅళ్ళ పర్యంతమయి చెప్పిందట.

అంతేకాక శ్రీజ ఫోన్ నుండి ఆమె ఇచ్చినట్లుగా డబ్బులు కావాలని యస్ యమ్ యస్ లు శ్రీజ తల్లిదండ్రులకు పంపించటం, కనీసం తన ఫోన్ నుండి తాను మాట్లాడుకోటానికి కూడా స్వేచ్చలేకుండా చేయటం వంటి అనేక కార్యకలాపాలకు కూడా శిరిష్ అతని తల్లి పాల్పడినట్లు శ్రీజ పోలీసులకు తెలిపిందట. పక్కింటి వారి కంప్యుటర్ నుండి తన తల్లిదండ్రులకు తన బాధలన్నింటినీ ఇ-మెయిల్ చేశానని కూడా శ్రీజ చెప్పిందట. శిరీష్ నుండి తనకు ప్రాణహాని ఉన్నందున అతన్నుండి శాశ్వతంగా విడిపోవాలని తాను కోరుకుంటున్నట్లు శ్రీజ చెప్పిందట.

శ్రీజ ఇచ్చిన రిపోర్ట్ తీసుకున్న పోలీసులు శిరీష్ అరెస్టుకు రంగమ సిద్ధం చేశారు.శిరిష్ దేశం వదిలిపోకుండా అన్ని విమానాశ్రయాల్లోనూ అతని ఫొటోను పంపి అక్కడి సెక్యురిటీ వారిని ఎలర్ట్ చేసినట్లు సమాచారం. శ్రీజ నేటి యువత దుందుడుకు మనస్తత్వానికీ, జీవితం పట్ల ఆవేశంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని, ఆ తర్వాత బాధపడే సగటు అమ్మాయిలకు ప్రతినిథిగా ప్రవర్తించింది.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.