English | Telugu
రామ్‌తో మరోసారి నిధి అగర్వాల్?
Updated : May 22, 2021
ఎనర్జిటిక్ స్టార్ రామ్ కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచిన చిత్రం `ఇస్మార్ట్ శంకర్`. డబుల్ దిమాక్ పోరగాడిగా రామ్ నటించిన ఈ సినిమాలో నిధి అగర్వాల్, నభా నటేశ్ పోటీపడి మరీ అందాల విందు చేశారు. మరీ ముఖ్యంగా.. నిధికి ఈ సినిమా మంచి టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. అంతేకాదు.. పిరియడ్ డ్రామాగా రూపొందుతున్న పాన్ - ఇండియా ప్రాజెక్ట్ `హరిహర వీరమల్లు`లో ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జోడీగా నటించే బంపర్ ఆఫర్ ని `ఇస్మార్ట్ శంకర్` అందించింది.
ఇదిలా ఉంటే.. తన లక్కీ హీరోతో మరోమారు ఆడిపాడేందుకు సిద్ధమైందట నిధి అగర్వాల్. ఆ వివరాల్లోకి వెళితే.. రామ్, కోలీవుడ్ కెప్టెన్ లింగుస్వామి కాంబినేషన్ లో తెలుగు, తమిళ భాషల్లో ఓ బైలింగ్వల్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో రామ్ కి జోడీగా `ఉప్పెన` ఫేమ్ కృతి శెట్టి నటిస్తోంది. కాగా, కథానుసారం ఇందులో ఓ ఊరమాస్ డ్యాన్స్ నంబర్ కి స్కోప్ ఉందని.. అందులో నిధిని నర్తింపజేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే రామ్ - లింగుస్వామి చిత్రంలో నిధి ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది. మరి.. రామ్, నిధి మరోసారి తమ చిందులతో `దిమాక్ ఖరాబ్` చేస్తారేమో చూడాలి.
