English | Telugu

బాల‌య్య బ‌ర్త్ డే కి.. `అఖండ‌` `డ‌బుల్ ధ‌మాకా` ట్రీట్?

`సింహా`, `లెజెండ్` వంటి సెన్సేష‌న‌ల్ హిట్స్ త‌రువాత న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ - మాస్ ఎంట‌ర్టైన‌ర్స్ స్పెష‌లిస్ట్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్ లో వ‌స్తున్న చిత్రం `అఖండ‌`. `సింహా`, `లెజెండ్` త‌ర‌హాలోనే ఇందులోనూ బాల‌య్య రెండు విభిన్న పాత్ర‌ల్లో సంద‌డి చేయ‌నున్నారు. ఇప్ప‌టికే ఈ రెండు పాత్ర‌ల‌కి సంబంధించి వేర్వేరు వీడియోల‌ను రిలీజ్ చేసింది యూనిట్. గ‌త ఏడాది బాల‌య్య పుట్టిన‌రోజు స్పెష‌ల్ గా `#BB3 First Roar ` పేరుతో ఓ వీడియోని విడుద‌ల చేయ‌గా.. ఈ ఏడాది ఉగాది సంద‌ర్భంగా `#BB3 Title Roar` పేరుతో మ‌రో వీడియోని రిలీజ్ చేశారు. ఈ రెండు వీడియోల‌కి కూడా యూట్యూబ్ లో మంచి స్పంద‌న వ‌చ్చింది.

క‌ట్ చేస్తే.. ఈ జూన్ 10న బాల‌య్య బ‌ర్త్ డే సంద‌ర్భంగా `అఖండ‌` టీజ‌ర్ ని రిలీజ్ చేయ‌డానికి చిత్ర బృందం స‌న్నాహాలు చేస్తోంద‌ట‌. అంతేకాదు.. ఈ టీజ‌ర్ లో బాల‌య్య రెండు పాత్ర‌ల‌కు సంబంధించిన `డ‌బుల్ ధ‌మాకా` విజువ‌ల్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నార‌ట‌. అలాగే హీరోయిన్స్ ప్ర‌గ్యా జైశ్వాల్, పూర్ణ‌కి సంబంధించిన విజువ‌ల్స్ కూడా ఇందులో పొందుప‌రిచిన‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే `అఖండ‌` టీజ‌ర్ కి సంబంధించి క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

మ‌రి.. `అఖండ‌`తో బాల‌య్య‌, బోయ‌పాటి కాంబినేష‌న్ హ్యాట్రిక్ కొడుతుందేమో చూడాలి.

ప్రియుడి ఫోటోలు డిలీట్ చేసిన హీరోయిన్.. పెళ్లి క్యాన్సిల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అలవైకుంఠ పురం' సాధించిన విజయం తెలిసిందే. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ కేటగిరి లో మెరిసిన భామ 'నివేత పేతురేజ్'. ఈ ఏడాది ఆగష్టులో సోషల్ మీడియా వేదికగా నివేత మాట్లాడుతు నేను దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రజిత్ ఇబ్రాన్ తో  రిలేషన్ లో ఉన్నట్టుగా వెల్లడి చేసింది. వెల్లడి చెయ్యడమే కాదు ఇంట్లో పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయని వచ్చే ఏడాది జనవరిలోనే మ్యారేజ్ ఉంటుందని చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులతో పాటు పలువురు నెటిజన్స్ నివేత కి కంగ్రాట్స్ చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పెళ్లి పెళ్లి పీటల వరకు వెళ్లేలా లేదనే అనుమానాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.