English | Telugu
పూజలు చేసింది నిజమే కానీ ఎలాంటివో తెలియదు..ఇద్దరిది సేమ్ కలర్
Updated : May 15, 2024
హీరోల కెరీర్ కే గ్యారంటీ లేని సినీ పరిశ్రమలో హీరోయిన్ పరిస్థితి ఎలా ఉంటుందో ఉహించుకోగలం. కానీ అందరి అంచనాలని తలకిందులు చేస్తు రెండు దశాబ్దాల నుంచి అంతకు మించి అని నిరూపిస్తున్న నటి నయనతార(Nayanthara)తాజాగా ఆమెకి సంబంధించిన కొన్ని పిక్స్ వైరల్ గా మారాయి
సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే నయన్ తాజాగా కొన్ని ఫొటోస్ ని షేర్ చేసింది. రెడ్ కలర్ డ్రెస్ ధరించిన నయన్ ఒక గుడిలో తన భర్త విగ్నేష్ (vignesh)తో కలిసి పూజలు చేసింది. ఆమె లుక్ అందర్నీ ఆకర్షిస్తుంది. అలాగే నయన్ ఆటిట్యూడ్ చూస్తుంటే తనే ఆ పూజలని ఏర్పాటు చేసిన విషయం అర్ధం అవుతుంది. విగ్నేష్ కూడా రెడ్ కలర్ షర్ట్ ధరించాడు. ఇక ఈ ఫోటోలని చూసిన చాలా మంది ఇద్దరకీ దిష్టి తగలకూడదని పూజలు జరిపించారనే కామెంట్స్ చేస్తున్నారు. కాకపోతే ఎలాంటి పూజలు చేసిందనే విషయంలో క్లారిటీ లేదు
ఈ ఫోటోలు ఇప్పుడు చాలా ప్రత్యేకం అని చెప్పవచ్చు.గత కొన్ని రోజుల క్రితం నయన్, విగ్నేష్ ల మధ్య సఖ్యత లేదనే రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వాటికీ చెక్ పెట్టినట్టయింది. ఇక నయన్ సరోగసి ద్వారా కవల మగ పిల్లలకి జన్మనిచ్చింది. వాళ్ళ పేర్లు ఉయిర్ అండ్ ఉలగం. సినీ కెరీర్ ని చూసుకుంటే లాస్ట్ ఇయర్ బాలీవుడ్ బాద్షా షారుక్ తో జవాన్ రూపంలో భారీ హిట్ ని కొట్టింది. అదే టైంలో తమిళ్ లో చేసిన అన్నపూర్ణి తో వివాదాల్లో చిక్కుకుంది. ప్రస్తుతం మలయాళంలో ఒక మూవీ తమిళ్ లో ఒక మూవీ చేస్తుంది. మరికొన్ని ప్రాజెక్ట్ లు చర్చల దశలో ఉన్నాయి. 2003 లో ఆమె సినీ ప్రయాణం మొదలయ్యింది