English | Telugu
ఓటీటీలోకి కృష్ణమ్మ.. వాట్ ఈజ్ దిస్ అమ్మా!
Updated : May 15, 2024
సత్యదేవ్ కథానాయకుడిగా వి.వి. గోపాల కృష్ణ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'కృష్ణమ్మ'. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పకుడు కావడం విశేషం. మే 10న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది. గత వారం విడుదలైన మిగతా తెలుగు సినిమాలతో పోలిస్తే.. కాస్త మెరుగైన వసూళ్లనే రాబడుతోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ అయినట్లు తెలుస్తోంది.
'కృష్ణమ్మ' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. జూన్ 7 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమ్ అయ్యే అవకాశముందని సమాచారం. అంటే థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకు ఓటీటీలో అందుబాటులోకి రానుందన్నమాట.
'కృష్ణమ్మ' మూవీ రివ్యూ
మీసాల లక్ష్మణ్, కృష్ణ బూరుగుల, అతిర, అర్చన అయ్యర్, నందగోపాల్, రఘు కుంచే తదితరులు నటించిన ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందించగా.. సినిమాటోగ్రాఫర్ గా సన్నీ కూరపాటి, ఎడిటర్ గా తమ్మిరాజు వ్యవహరించారు.