English | Telugu
మహేష్ సీక్రెట్ ని బయటపెట్టిన నమ్రత
Updated : Nov 11, 2023
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గురూజీ త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీ గుంటూరు కారం. ఆల్రెడీ ఈ మూవీ నుంచి లేటెస్ట్ గా దం మసాలా సాంగ్ రిలీజ్ అయ్యి మహేష్ ఫాన్స్ చేత డాన్స్ లు కూడా వేయిస్తుంది. ఇప్పుడు మహేష్ ఫాన్స్ ఆనందాన్ని రెట్టింపు చేసేలా మహేష్ వైఫ్ నమ్రత గుంటూరు కారం మూవీలో మహేష్ క్యారెక్టర్ పలానా విధంగా ఉండబోతుందని చెప్పి మహేష్ ఫాన్స్ కి ఈ దీపావళి కి మంచి గిఫ్ట్ ని ఇచ్చింది.
నమ్రత తాజాగా హైదరాబాద్ లో ఒక స్టోర్ ప్రారంభోత్సవంలో పాల్గొంది. అక్కడ ఆమెని కొంత మంది మీడియా వాళ్ళు గుంటూరు కారం మూవీలో మహేష్ గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుందని అడిగారు. దీంతో గుంటూరు కారంలో మహేష్ క్యారెక్టర్ ఎంతో ఎంటర్టైనింగ్ గా ఫన్నీగా సాగుతూ మాస్ స్టైల్ లో ఉంటుందని అలాగే ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని అలరించేలా దర్శకుడు త్రివిక్రమ్ గుంటూరు కారం మూవీ ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడని నమ్రత చెప్పింది. గుంటూరు కారం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.
నమ్రత చెప్పిన ఈ వ్యాఖ్యలతో మహేష్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. కాగా మహేష్ ,త్రివిక్రమ్ కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చి నేటికీ మహేష్ అభిమానుల ఫేవరేట్ మూవీల్లో స్థానం సంపాదించాయి. ఇప్పుడు ఈ గుంటూరు కారం మూవీ కూడా వాటి సరసన నిలుస్తుందని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.