English | Telugu
సింగర్ ని మార్చిన రామ్ చరణ్
Updated : Nov 11, 2023
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీ కోసం చెర్రీ ఫాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో మూవీ ఫ్యాన్స్ కూడా అంతే ఇదిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ నుంచి దీపావళి కానుకగా ఒక సాంగ్ ని రిలీజ్ చేస్తామని మేకర్స్ కొన్ని రోజుల క్రితం అఫీషియల్ గా ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ సాంగ్ రావడం లేదని చిత్ర బృందం ప్రకటన చేసింది. అందుకు కారణం తెలిసి చరణ్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
గేమ్ చేంజర్ మూవీ మేకర్స్ ఏ సాంగ్ అయితే రిలీజ్ చెయ్యాలనుకున్నారో ఆ సాంగ్ కి సంబంధించిన సింగర్ ని మార్చడం వల్లే ఇప్పుడు సాంగ్ దీపావళికి రావడంలేదు.ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అసలు ఫస్ట్ నుంచి కూడా గేమ్ చేంజర్ మూవీ నుంచి ఏదీ కుడా అనుకున్న సమయానికి రావడం లేదు. అడుగడుగునా ఏదో ఒక అవాంతరం వస్తూనే ఉంది. ఒకసారి చరణ్ కి షూటింగ్ లో గాయాలు అవ్వడం వల్ల షూటింగ్ కూడా లేటు అవుతు వచ్చింది.
దిల్ రాజు ఈ గేమ్ చేంజర్ మూవీని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఖర్చుకి ఎక్కడ వెనకాడకుండా పాన్ ఇండియా లెవెల్లో నిర్మిస్తున్నాడు. భారతదేశం గర్వించే దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ మీద చరణ్ ఫాన్స్ తో పాటు సినీ అభిమానుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.