English | Telugu

అక్కినేని ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. తండ్రి కాబోతున్న నాగ చైతన్య!

అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్. నాగ చైతన్య(Naga Chaitanya), శోభితా ధూళిపాళ్ల(Sobhita Dhulipala) దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయాన్ని నాగ చైతన్య అధికారికంగా ప్రకటించనున్నాడని సమాచారం.

సమంతతో విడిపోయిన తరువాత శోభితను నాగ చైతన్య పెళ్ళాడిన విషయం తెలిసిందే. వీరి విహహం 2024 డిసెంబర్ 4న జరిగింది. ఇటీవలే ఏడాది పూర్తయింది. అయితే త్వరలో ఈ జంట గుడ్ న్యూస్ చెప్పనుందని వినికిడి. ప్రస్తుతం శోభిత ప్రెగ్నెంట్ అని అంటున్నారు. త్వరలో మనవడో మనవరాలో తమ ఇంట అడుగుపెట్టనునడంతో.. నాగార్జున సహా అక్కినేని కుటుంబ సభ్యులంతా ఎంతో సంతోషంగా ఉన్నారట. ఈ సంతోషకర విషయాన్ని త్వరలోనే అభిమానులతో పంచుకోనున్నారట.

Also Read: డేవిడ్ రెడ్డి మూవీలో రామ్ చరణ్!

ఇటీవల సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరుని వివాహం చేసుకొని.. కొత్త జీవితాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీంతో సమంత అభిమానులు సంతోషంగా ఉన్నారు. ఇక ఇప్పుడు చైతన్య తండ్రి కాబోతున్నాడన్న వార్త.. అక్కినేని అభిమానుల్లో ఆనందాన్ని నింపుతుంది అనడంలో సందేహం లేదు.

సినిమాల విషయానికొస్తే, ఈ ఏడాది 'తండేల్'తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నాగ చైతన్య.. ప్రస్తుతం 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో 'వృషకర్మ' అనే సినిమా చేస్తున్నాడు. ఈ మైథలాజికల్ థ్రిల్లర్ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.