English | Telugu

16 ఏళ్ళ లోపు పిల్లల విషయంలో అందరు ఈ పని చెయ్యాలి..సోను సూద్ డిమాండ్  


-ఉత్తరప్రదేశ్ లో చనిపోయిన పిల్లల విషయంలో ఏం చెయ్యాలి
-సోను సూద్ చెప్పేది ఫాలో అవ్వాలా!
-ఆ టైం వచ్చిందా!
-సోను సూద్ ఇంతకీ ఏం చెప్తున్నాడు

'బొమ్మాలి నిన్ను వదల' అంటు తెలుగు ప్రేక్షకులకి సరికొత్త విలనిజాన్ని పరిచయం చేసిన వర్ స్టైల్ యాక్టర్ 'సోను సూద్'(Sonu Sood). అలరించడమే కాదు ఎప్పటికప్పుడు ఆల్ వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్స్ ని పోషిస్తు ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. బాషా బేధం తో సంబంధం లేకుండా పాన్ ఇండియా వ్యాప్తంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ పాన్ ఇండియా రియల్ హీరోగా కూడా గుర్తింపు పొందాడు. ఎప్పుడు ఆ రెండు విభాగాలకి సంబంధించి సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచే సోను సూద్ ఇప్పుడు పదహేరేళ్ళ వయసు లోపు ఉన్న పిల్లల గురించి తీసుకోవల్సిన జాగ్రత్తలతో ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ గా మారాడు. ఆ డిటైల్స్ ఏంటో చూద్దాం.


రీసెంట్ గా ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్(Ghaziabad)లో ఆన్ లైన్ గేమింగ్ వ్యసనానికి బానిసలైన ముగ్గురు మైనర్ యువతులు తమ అపార్ట్మెంట్ పై నుంచి కిందకి దూకి చనిపోయిన సంఘటన ప్రతి ఒక్కరిని ఎంతగానో కలిచివేస్తుంది. ఈ విషయంపై సోను సూద్ ఎంతో ఆవేదనతో మాట్లాడుతు 'సోషల్ మీడియా ప్రపంచంలో చిక్కుకొని ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లలు చనిపోవడం బాధాకరం. స్మార్ట్ ఫోన్ అనేది పిల్లల చేతుల్లో ఆయుధంగా మారుతుంది. వాటి వినియోగంపై నియంత్రణ లేకపోతే ఇలాంటి విషాదాలే పునరావృతమయ్యే ప్రమాదం ఉంది. మన బాల్యానికి ఇప్పుడు మార్గదర్శకత్వం అవసరం. చదువు కోసం తప్ప పదహారు సంవత్సరాల లోపు పిల్లలకి సోషల్ మీడియా, ఆన్ లైన్ గేమింగ్ పై కఠినమైన రూల్స్ ని విధించే సమయం వచ్చింది. తల్లి తండ్రులు తమ పిల్లలు ఫోన్ లో ఏం చేస్తున్నారో గమనిస్తుండాలి. కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేలా చూడాలని సోను సూద్ ప్రభుత్వాలకి, ప్రజలకి విజ్ఞప్తి చేసాడు.


also read:శృతి హాసన్ వల్ల ఒక పాప ప్రాణాలు సేఫ్.. ఆ పాప ఎవరో తెలుసా

చనిపోయిన ముగ్గురు అమ్మాయిలు స్వయానా అక్కా చెల్లెల్లు. కొరియన్ కి చెందిన టాస్క్ ఆధారిత గేమ్ కి బానిస అయ్యి అందులో ఉన్న చివరి టాస్క్ ప్రకారం తొమ్మిదవ అంతస్థు నుంచి దూకి చనిపోయారు.

టైటిల్ మార్చాలని రోడ్డు ఎక్కిన బ్రాహ్మణులు.. ఎందుకు అలా చేస్తున్నారు

తెలుగు సినిమా ప్రేమికులు 'మనోజ్ బాజ్ పేయి'(Manoj Bajpayee)పేరు చెప్పగానే చాలు, విలక్షణమైన పెర్ ఫార్మెన్స్ కి పేటంట్ హక్కు తీసుకున్న యాక్టర్ కదా అంటారు. పైగా తన గురించి మనం ఏం చెప్పబోతున్నామో పూర్తిగా వినకుండానే సదరు మూవీ లవర్స్ ఎంతో ఆనందంతో 'సత్య మూవీలోని బీకు మాత్రే, ప్రేమకథ లోని శంకరం, అల్లు అర్జున్  హ్యాపీ లోని డిసిపి అరవింద్, పవన్ కళ్యాణ్  పులి లోని ఏ ఐ సలీం, వేదం లోని రహీముద్దీన్ ఖురేషి క్యారెక్టర్స్ లలో మనోజ్ బాజ్ పేయి ఒక రేంజ్ లో  చేసాడు కదా అని స్టార్ట్ చేస్తారు.ఆయన పెర్ ఫార్మెన్స్ కి   అంత రేంజ్ ఉంది.