English | Telugu

తండేల్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

యువసామ్రాట్ నాగ చైతన్య(Naga Chaitanya)సాయిపల్లవి(Sai Pallavi)కాంబోలో తెరకెక్కిన 'తండేల్'(Thandel)నిన్న వరల్డ్ వైడ్ గా విడుదలైన విషయం తెలిసిందే.శ్రీకాకుళంలోని మత్స్యకారుల కుటుంబంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ భారీ బడ్జెట్ తో నిర్మించగా చందు మొండేటి(Chandu Mondeti)దర్శకత్వం వహించాడు.

ఇక ఈ మూవీ మొదటి రోజు రికార్డు స్థాయిలో వరల్డ్ వైడ్ గా 21 .27 కోట్ల రూపాయిల కలెక్షన్స్ ని సాధించింది.ఈ మేరకు బ్లాక్ బస్టర్ 'తండేల్' సునామి అంటు చిత్ర బృందం అధికారకంగా ప్రకటించింది.చైతు కెరీర్ లోనే ఫస్ట్ టైం హయ్యస్ట్ గ్రాస్ సాధించిన మూవీ కూడా తండేల్ నిలిచింది. తండేల్ ముందు వరకు 'లవ్ స్టొరీ' సినిమా ఉండేది.ఇప్పుడు లవ్ స్టోరీ ని వెనక్కి నెట్టి 'తండేల్' ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది.

ఇక మూవీకి అయితే ప్రస్తుతానికి పాజిటివ్ టాక్ ఉన్న దృష్ట్యా మరిన్ని కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వారు వ్యక్తం చేస్తున్నారు.చైతు,సాయి పల్లవి ల నటనతో పాటు దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం,బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా విజయంలో ప్రధాన పాత్ర పోషించాయనే అభిప్రాయాన్ని మెజారిటీ సినీ ప్రేమికులు చెప్తున్నారు.

టైటిల్ మార్చాలని రోడ్డు ఎక్కిన బ్రాహ్మణులు.. ఎందుకు అలా చేస్తున్నారు

తెలుగు సినిమా ప్రేమికులు 'మనోజ్ బాజ్ పేయి'(Manoj Bajpayee)పేరు చెప్పగానే చాలు, విలక్షణమైన పెర్ ఫార్మెన్స్ కి పేటంట్ హక్కు తీసుకున్న యాక్టర్ కదా అంటారు. పైగా తన గురించి మనం ఏం చెప్పబోతున్నామో పూర్తిగా వినకుండానే సదరు మూవీ లవర్స్ ఎంతో ఆనందంతో 'సత్య మూవీలోని బీకు మాత్రే, ప్రేమకథ లోని శంకరం, అల్లు అర్జున్  హ్యాపీ లోని డిసిపి అరవింద్, పవన్ కళ్యాణ్  పులి లోని ఏ ఐ సలీం, వేదం లోని రహీముద్దీన్ ఖురేషి క్యారెక్టర్స్ లలో మనోజ్ బాజ్ పేయి ఒక రేంజ్ లో  చేసాడు కదా అని స్టార్ట్ చేస్తారు.ఆయన పెర్ ఫార్మెన్స్ కి   అంత రేంజ్ ఉంది.