English | Telugu

మంచు లక్ష్మీ 'బుడుగు' ఫస్ట్ లుక్

మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న 'బుడుగు' సినిమా ఫస్ట్ లుక్ ను ఈరోజు విడుదల చేశారు. ఈ సినిమా ఛైల్డ్ క్లినిక‌ల్ సైకాల‌జీ నేప‌థ్యంలో న‌డిచే ఇంటెన్స్ ఫ్యామిలీ థ్రిల్లర్. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ దాదాపుగా పూర్తికావ‌చ్చింది. త్వరలో పాటలను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పిల్లలు, త‌ల్లిదండ్రులు వాళ్ల మ‌ధ్య ఉండాల్సిన అనుబంధాలు మొద‌లైన విష‌యాల్ని ఈ సినిమాలో ట‌చ్ చేశార‌ట‌. ఇలాంటి క‌థ ఇది వ‌ర‌కెప్పుడూ రాలేద‌ని చిత్రబృందం చెబుతోంది.