English | Telugu

సచిన్ తో కలిసి సందడి చేసిన అనుష్క

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తో కలిసి టాలీవుడ్ బ్యూటీ అనుష్క విజయవాడలో సందడి చేసింది. సౌత్ ఇండియాలోనే అతి పెద్ద షాపింగ్ మాల్ గా చెప్పబడుతున్న పీవీపీ స్క్వేర్ ను ఈ రోజు ఉదయం సచిన్ ప్రారంభించాడు. దేశంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్స్ లో ఒకటైన పీవీపీ స్క్వేర్ ను సుమారు 125 కోట్లతో ప్రముఖ తెలుగుసినీ నిర్మాత, పారిశ్రామిక వేత్త పీవీపీ ప్రసాద్ నిర్మించారు. ఈ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సచిన్ తో పాటు అనుష్క, ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వినీదత్ కూడా హాజరయ్యారు. సోదరీ సోదరీమణులారా అంటూ తెలుగులో సచిన్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టడం విశేషం. అలాగే సచిన్ తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని అనుష్క తెలిపింది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.