English | Telugu

ఎన్టీఆర్‌ పూరి జగన్నాథ్‌ చిత్రం ప్రారంభం

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో అగ్ర నిర్మాత బండ్ల గణేష్‌ నిర్మిస్తున్న ప్రొడక్షన్‌ నెం.5 చిత్రం షూటింగ్‌ ఆగస్ట్‌ 1 ఉదయం 7.44గం॥లకు పూరి జగన్నాథ్‌ నూతన కార్యాలయం ‘కేవ్‌’లో ప్రారంభమైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన ఫస్ట్‌ షాట్‌కు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ క్లాప్‌ నివ్వగా, డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత బండ్ల గణేష్‌ మాట్లాడుతూ - ‘‘ఎన్టీఆర్‌తో ‘బాద్‌షా’ వంటి సూపర్‌హిట్‌ చిత్రం తర్వాత చేస్తున్న సినిమా ఇది. అలాగే పూరి జగన్నాథ్‌గారితో మా బేనర్‌లో ఇది రెండో సినిమా. ఎన్టీఆర్‌, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో చేస్తున్న డిఫరెంట్‌ కమర్షియల్‌ మూవీ ఇది. ఎన్టీఆర్‌ సరసన కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. రేపటి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ చేసి నాన్‌స్టాప్‌గా షూటింగ్‌ చేస్తాం. జనవరి 9న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా విడుదల చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నాం. ఎన్టీఆర్‌ కెరీర్‌కి, పూరి జగన్నాథ్‌గారి కెరీర్‌కి, మా బేనర్‌కి ఇది ప్రెస్టీజియస్‌ మూవీ అవుతుంది’’ అన్నారు.



యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ సరసన కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, ఆలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జీ, వెన్నెల కిషోర్‌, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తారు.



ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, సినిమాటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఫైట్స్‌: విజయ్‌, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్‌, స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .