English | Telugu

చిరంజీవి పై మాళవిక మోహనన్ కీలక వ్యాఖ్యలు.. రూమర్స్ కి చెక్ 

- స్పీడ్ పెంచిన చిరంజీవి
- మెగా 158 అప్ డేట్
- మాళవిక మోహనన్ కీలక వ్యాఖ్యలు
- బాబీ ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్


మెగాస్టార్ 'చిరంజీవి'(Chiranjeevi)హీరో అనే స్థాయి నుంచి అభిమానుల, ప్రేక్షకుల ఇంటి సభ్యుడుగా మారి చాలా సంవత్సరాలు అవుతుంది. ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారు(Mana Shankara Vara Prasad Garu)షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఇటీవల ఈ చిత్రం నుంచి 'మీసాలపిల్ల'(Meesala Pilla)సాంగ్ వచ్చి రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది. దీంతో చిరు స్టామినా ఏంటో మరోసారి చెప్పినట్లయింది. 2026 సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు థియేటర్స్ లో అడుగు పెట్టనుంది. కానీ ఈ చిత్రం సెట్స్ పై ఉండగానే నో రెస్ట్ ఓన్లీ యాక్షన్ అనేలా వాల్తేరు వీరయ్య దర్శకుడు 'బాబీ'(Bobby)తో నెక్స్ట్ చిత్రాన్ని ప్రకటించాడు. చిరు నుంచి వస్తున్న 158 మూవీ కావడంతో మెగా 158 గా చిత్రీకరణ జరుపుకోనుంది.

మోస్ట్ లీ ఈ చిత్రం కూడా త్వరలోనే షూట్ కి వెళ్లనుందని అందుకు సంబంధించిన మిగతా పనుల్లో బాబీ ఉన్నట్టుగా ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తుంది. ఇక ఈ చిత్రంలో చిరుకి జోడిగా ప్రముఖ హీరోయిన్ మాళవిక మోహనన్(Malavika Mohanan)జోడి కట్టబోతుందనే వార్తలు కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి రేపో మాపో అధికార ప్రకటన రానుందనే వార్తలు కూడా జోరుగానే వచ్చాయి. కానీ అనూహ్యంగా ఈ విషయంపై మాళవిక మోహనన్ స్పందించడం జరిగింది. ఆమె మాట్లాడుతు నేను మెగా 158 లో చేస్తున్నాననే వార్తలు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. కెరీర్ లో చిరంజీవి గారి లాంటి బడా హీరోతో చెయ్యాలని కోరుకుంటున్నాను. ఆ అవకాశం కోసమే ఎదురుచూస్తున్నాను. కానీ మెగా 158 లో మాత్రం చేయడం లేదని తెలిపింది.


Also Read: ఇడ్లీ కొట్టు ఓటిటిలోకి వచ్చేసింది.. కానీ మీరు ఏం చేయాలో తెలుసా!


మలయాళ చిత్రపరిశ్రమకి చెందిన మాళవిక మోహనన్ 2013 లో దుల్కర్ సల్మాన్ తో కలిసి 'పట్టంపోలె' అనే మలయాళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. అనతి కాలంలోనే ఇతర భాషల్లోకి ప్రవేశించి మాస్టర్, పేట, తంగలాన్, హృదయ పూర్వం వంటి అగ్ర హీరోల చిత్రాల్లో చేసి పాన్ ఇండియా నటిగా గుర్తింపు పొందింది. ఆ లెగసి నే కంటిన్యూ చేస్తు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ది రాజాసాబ్ లో చేస్తుంది. ప్రచార చిత్రాలు చూస్తుంటే కథకి చాలా ఇంపార్టెన్స్ క్యారెక్టర్ లోనే మాళవిక మోహన్ కనిపించబోతున్నట్టుగా అర్ధం అవుతుంది. ప్రస్తుతం తన లిస్ట్ లో సర్దార్ 2 మాత్రమే ఉంది.ఇందులో కార్తీ హీరో. మెగా 158 లో చిరు సోదరుడిగా కార్తీ చేస్తున్నాడనే వార్తలు గత కొద్దీ రోజుల నుంచి వినిపిస్తున్నాయి.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.