English | Telugu
కృష్ణ పై మహేష్ బాబు ఎమోషనల్ ట్వీట్.. వైరల్ గా మారిన ssmb 29
Updated : Nov 15, 2025
-మహేష్ ఎమోషనల్ ట్వీట్
-ssmb 29 హంగామా స్టార్ట్
-జై కృష్ణ, మహేష్ నినాదాలు
-మహేష్ ఏం మాట్లాడబోతున్నాడు
సిల్వర్ స్క్రీన్ వద్ద 'మహేష్ బాబు'(Mahesh Babu)చరిష్మాకి ఉన్న 'ఖలేజా' ఏ పాటిదో తెలిసిందే. ఇప్పుడు ఆ ఖలేజా ని పాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్లడానికి 'ssmb 29 'ముస్తాబవుతోంది. అభిమానుల సుదీర్ఘ నీరీక్షణకి తెరదించుతు ఈ రోజు రామోజీ ఫిలింసిటీ లో ఫస్ట్ టైం ssmb 29 నుంచి అధికారకంగా వేడుక జరుగుతుండటంతో వాళ్ల ఆనందం అంతా ఇంతా కాదు. పైగా ఈ రోజు మరో సూపర్ స్టార్ కృష్ణ(Krishna)వర్ధంతి. దీంతో రామోజీ ఫిలింసిటీ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాలు జై కృష్ణ, జై మహేష్ బాబు నినాదాలతో మార్మోగిపోతున్నాయి.
రీసెంట్ గా మహేష్ ఎక్స్ వేదికగా స్పందిస్తు 'నాన్న ఈ రోజు నీ గురించి కొంచం ఎక్కువగా ఆలోచిస్తున్నాను. మీరు ఉండి ఉంటే చాలా గర్వపడే వాళ్ళు అంటూ ట్వీట్ చేసాడు. దాంతో పాటు 'కొడుకుదిద్దిన కాపురం' మూవీలో తన తండ్రి కృష్ణతో కలిసి చేసిన ఒక సన్నివేశంలోని స్టిల్ ని కూడా షేర్ చేసాడు. మహేష్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభిమానులు అయితే మహేష్ చేసిన ట్వీట్ తో సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు మా దైవం కృష్ణగారు మహేష్ బాబు నుంచి వచ్చిన దాదాపు అన్ని సినిమాల ఫంక్షన్స్ కి హాజరయ్యేవారు.
also read:అసలు ssmb 29 ప్రొడ్యూసర్ ఎవరు!
ఈ సందర్భంగా మహేష్ గురించి కృష్ణ గారు, కృష్ణ గారి గురించి మహేష్ చెప్పే మాటలు మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకునేవి. ఇద్దరు కలిసి ఒకే వేదికపై పక్కపక్కన ఉంటే ఎంతగానోసంతోషపడిపోయే వాళ్లమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ రోజు ఈవెంట్ లో మహేష్ బాబు స్పీచ్ పై అభిమానులతో పాటు అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. సదరు ఈవెంట్ కి సంబంధించి మహేష్ ఇప్పటికే అభిమానులకి పలు సూచనలు కూడా చేసిన విషయం తెలిసిందే.