English | Telugu

మా ఊరి పొలిమేర 2 ఫస్ట్ లుక్ పోస్టర్

‘మా ఊరి పొలిమేర‌’ మూవీ సైలెంట్ గా వచ్చి మంచి సక్సెస్ ని అందుకుంది. ఇందులో స‌త్యం రాజేష్‌, బాలాదిత్య‌, ర‌వి వ‌ర్మ‌, కామాక్షి భాస్క‌ర్ల‌, గెట‌ప్ శీను, చిత్రం శ్రీను ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించారు. డిఫ‌రెంట్ స్క్రీన్‌ప్లేతో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా ఆడియెన్స్‌ను అల‌రించింది. ఇక ఈ మూవీ సీక్వెల్ ఉత్త‌రాఖండ్‌, కేర‌ళ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఖ‌మ్మం, హైద‌రాబాద్ ప్రాంతాల్లో పూర్తి చేసుకుంది. ఈ సీక్వెల్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ని గెటప్ శీను తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకున్నాడు.

" మోస్ట్ ఎవైటెడ్ స్ట్రైకింగ్ & స్కింటిలేటింగ్ మా ఊరి పొలిమెర సీక్వెల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇదిగో ... థియేటర్స్ లో త్వరలో మీ కోసం రాబోతోంది" అని పోస్ట్ చేసుకున్నాడు. ఈ మూవీ సీక్వెల్ కూడా ఫస్ట్ పార్ట్ లా ఆడియన్స్ ని ఆక‌ట్టుకుంటుంద‌ని... ఎవరూ ఊహించ‌లేని ట్విస్టులు, మలుపులు ఉన్నాయని చెప్పారు ప్రొడ్యూసర్స్. ఈమధ్య బ్లాక్ మ్యాజిక్ కి సంబంధించి ఎన్నో రకాల మూవీస్ వస్తున్నాయి. గూస్ బంప్స్ తెప్పించే మూవీస్ నే చూడడానికి ఇష్టపడుతున్నారు ఆడియన్స్ కూడా. సత్యం రాజేష్ కి చేతబడులు, మంత్ర విద్యలు వచ్చు అనే విషయాన్ని ఫస్ట్ పార్టులో రివీల్ చేశారు. కానీ ఇప్పుడు సెకండ్ పార్టులో ఏ అంశం గురించి చెప్పబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఫస్ట్ పార్ట్ లో బాలాదిత్య చాలా కూల్‌గా సైలెంట్ గా ఎవరేమన్నా ఎక్కడ బోర్డర్ తప్పకుండా తన పని తాను చేసుకుంటూ కనిపించాడు. మరి ఈ సెకండ్ పార్ట్ లో బాలాదిత్య ఎలా కనిపించబోతున్నాడు...వంటి విషయాలు తెలియాలంటే కొన్ని డేస్ వెయిట్ చేయాలి.