English | Telugu

తొలిరోజు ఎవరు గెలిచారు

తొలిరోజు ఎవరు గెలిచారు

సూపర్ స్టార్ 'మహేష్ బాబు'(Mahesh Babu)వన్ మాన్ షో 'ఖలేజా'(Khaleja)నిన్న వరల్డ్ వైడ్ గా రీ రిలీజైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో సార్లు సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైనా కూడా రికార్డు ఓపెనింగ్స్ ని రాబట్టింది. పైగా రిలీజ్ కి ముందు చాలా కేంద్రాల్లో ప్రీమియర్ షోస్ ని కూడా జరుపుకుందంటే 'ఖలేజా' సృష్టించిన ప్రభంజనాన్ని అర్ధం చేసుకోవచ్చు.

ఇక ఈ మూవీ తొలి రోజు వరల్డ్ వైడ్ గా 6 .5 కోట్ల రూపాయల గ్రాస్ ని వసూలు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. దీంతో పవన్ కళ్యాణ్(Pawan Kalyan)వన్ మాన్ షో గబ్బర్ సింగ్(Gabbar Singh)తర్వాత, ఇండియా వైడ్ గా రీ రిలీజ్ చరిత్రలో సెకండ్ ఓపెనింగ్ సాధించిన సినిమాగా 'ఖలేజా' చరిత్ర సృష్టించింది. దీంతో మహేష్ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. గబ్బర్ సింగ్ తొలి రోజు 7  కోట్ల రూపాయిల కలెక్షన్స్ ని సాధించి నెంబర్ వన్ సినిమాగా ఉంది.

ఇప్పుడు ఈ కలెక్షన్స్ వివరాలు సోషల్ మీడియాలో వస్తుండంతో టాక్ ఆఫ్ ది డే గా నిలిచాయి.   మహేష్ బర్త్ డే సందర్భంగా ఆగస్టు 9 న 'అతడు'  రీ రిలీజ్ కాబోతుండటంతో, ఈ సారి తొలి రోజు రికార్డులు మహేష్ వశం కావడం ఖాయమని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి అభిమానులు ఆశించినట్టుగానే 'అతడు' తో మహేష్ తొలి రోజు రికార్డు అందుకుంటాడేమో చూడాలి.