English | Telugu

ప్రముఖ నటుడి డ్రగ్స్ కేసు.. కోర్టు తీర్పు ఏంటంటే..?

దసరా, దేవర వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మలయాళ నటుడు షైన్ టామ్ చాకోకి కేరళ కోర్టులో ఉపశమనం లభించింది. గతంలో డ్రగ్స్ కేసులో అరెస్టయిన షైన్ టామ్ చాకో.. బెయిల్ పై విడుదలయ్యాడు. తాజాగా ఆ కేసులో ఆయనను నిర్దోషిగా తెలుస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. (Shine Tom Chacko)

2015 లో ఒక ఫ్లాట్ లో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆ కేసులో షైన్ టామ్ చాకోతో పాటు మరో ఆరుగిరిని అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్ పై బయటకు వచ్చాడు షైన్ టామ్ చాకో. అప్పటికే నటుడిగా మలయాళంలో పలు సినిమాలు చేసిన ఆయన.. బెయిల్ పై విడుదలయ్యాక వరుస సినిమాలు చేస్తూ మలయాళంతో ఇతర భాషల ప్రేక్షకులకు కూడా చేరువయ్యాడు. మరోవైపు పదేళ్ల నుంచి డ్రగ్స్ కేసు విచారణ కోర్టులో జరుగుతూనే ఉంది. ఎట్టకేలకు ఇన్నేళ్లకు ఈ కేసు నుంచి బయటపడ్డాడు చాకో. ఆయనతో సహా మిగతా ఆరుగురిని కూడా నిర్దోషులుగా తేలుస్తూ మంగళవారం నాడు కేరళ కోర్టు తీర్పు వెలువరించింది.