English | Telugu
జనసేన ఎంపీ కొడుకుతో కలిసి విశ్వక్ సేన్ ఏం చేసాడో తెలుసా
Updated : Feb 11, 2025
విశ్వక్ సేన్(Vishwak Sen)ఆకాంక్ష శర్మ(Akhansha Sharma)హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన 'లైలా'(Laila)ఈ నెల 14 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.రామ్ నారాయణ్ దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రంలో విశ్వక్ లేడీ గెటప్ లో కనిపిస్తుండంతో సినిమా పట్ల అందరిలో ఆసక్తి నెలకొని ఉంది.ప్రచార చిత్రాలతో పాటు ట్రైలర్ కూడా ఒక రేంజ్ లో ఉండటం,మెగాస్టార్ చిరంజీవి సైతం ఇటీవల జరిగిన 'లైలా'మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కి రావడం కూడా 'లైలా' కి ప్రేక్షకుల్లో మరింత క్రేజ్ పెరిగిందని చెప్పవచ్చు.
విశ్వక్ సేన్ రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా మోపిదేవి(MOpidevi)లో స్వయంభువుగా వెలిసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి(Subramanyeswara swami)ని దర్శించుకున్నాడు. తన సినిమా విజయాన్ని కోరుకుంటు ప్రత్యేక పూజలు నిర్వహించిన విశ్వక్ కి అర్చకులతో పాటు ఆలయ అధికారులు స్వామి వారి చిత్ర పటం, తీర్థ ప్రసాదాలు అందచేశారు.విశ్వక్ సేన్ వెంట మచిలీపట్నం జనసేన(Janasena)ఎంపీ బాలశౌరి కుమారుడు అనుదీప్ కూడా స్వామి వారిని దర్శించుకున్నాడు.
పవిత్ర శైవక్షేత్రంగా విరాజిల్లే మోపిదేవి క్షేత్రంలో తండ్రి కొడుకులైన సాంబశివుడు,సుబ్రమణ్య స్వామి కలిసి స్వయంభువులుగా కొలువుతీరి ఉండటం మోపిదేవి క్షేత్రం యొక్క ప్రత్యేకత. రాహు కేతు పూజలకి కూడా పెట్టింది పేరైన మోపిదేవి సుబ్రహ్మణ్యుడి దర్శనం కోసం దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు.శతాబ్దాల చరిత్ర గల మోపిదేవి సుబ్రహ్మణ్యుడి గుడిలో ఉన్ననాగ పుట్ట కూడా ఎంతో మహిమాన్వితమైనది.