English | Telugu
బాగా పెంచేస్తున్న కాజల్
Updated : Jun 20, 2013
ఇటీవలే కాజల్ నటించిన చిత్రాలు వరుసగా విజయం సాధిస్తుండడం తో ఈ అమ్మడు తన రేటును 2 కోట్లకు పెంచేసిందట. అయితే ఇదంతా కేవలం ఒక్క సినిమా యొక్క రెమ్యునరేషన్ మాత్రమే. ఇంకా వీరు ఏదైనా ప్రోగ్రాంకి రావాలన్న, ఏదైనా వాణిజ్య ప్రకటనలు చేయాలన్న, స్పెషల్ సాంగ్స్ లో డాన్స్ చేయాలంటే అది వేరే రేటు.
మరి ఇంతింత డబ్బులు పెట్టి వీళ్ళను సినిమాలోకి తీసుకుంటే, సినిమా హిట్టయితే మళ్ళీ రేటు పెంచేస్తున్నారు, లేదంటే ఆ సినిమాకు వాళ్ళకు సంబంధమే లేనట్లుగా ప్రవర్తిస్తున్నారు. దీంతో విషయం తెలుసుకున్న నిర్మాతలు ఈ అమ్మడికి అంత సీన్ లేదని చెప్పి, కాజల్ ని కాకుండా వేరే హీరోయిన్ ను తీసుకుంటున్నారంట. మరి ఈ అమ్మడు తగ్గుతుందో లేదో చూడాలి.