English | Telugu

తెలుగులో "రేణుకాష్టం"

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ సతీమణి రేణుకాదేశాయ్ నిర్మాతగా మారి తన మాతృభాష మరాఠీలో "మంగళాష్టకే ఒన్స్‌మోర్" అనే చిత్రాన్ని రూపొందిస్తుండడం తెలిసిందే. ఇదే పెద్ద వార్త అనుకొంటె.. తాను నిర్మిస్తున్న చిత్రానికి రేణు ఎంచుకొన్న కథాంశం మరింత పెద్ద వార్తగా మారింది.

"కొన్ని కలహాల కారణంగా కూలిపోబోతున్న తమ కాపురాన్ని ఓ జంట ఎలా కాపాడుకొంది" అన్న కథాంశంతో "మంగళాష్టకే ఒన్స్‌మోర్" తెరకెక్కుతుండడంతో ఈ అంశం పదే పదే వార్తలకెక్కుతోంది. ఎందుకంటె.. పవన్‌కళ్యాణ్_రేణుదేశాయ్ విడిపోయారంటూ గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతుండడం తెలిసిందే. ఈ ప్రచారానికి ఊతమిస్తూ.. రేణుదేశాయ్ తెలుగులోకాకుండా మరాఠీలో ఓ చిత్రం నిర్మిస్తుండడం సహజంగనే చర్చనీయాంశమవుతోంది.

ఇకపోతే.. "మంగళాష్టకే ఒన్స్‌మోర్" చిత్రం తెలుగు డబ్బింగ్ రైట్స్‌కు మంచి గిరాకి ఏర్పడుతోంది. ఈమేరకు రేణుదేశాయ్‌తో సంప్రదింపులు జరిపేందుకు పలువుతు నిర్మాతలు అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించారని తెలుస్తొంది!