English | Telugu

ఊరమాస్ లుక్ తో మీసం మెలేసిన ఎన్టీఆర్!

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' అనే భారీ యాక్షన్ ఫిల్మ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్ బాగా బక్కగా అయిపోయాడు. ముఖ్యంగా శివ రీ-రిలీజ్ ట్రైలర్ విడుదల సందర్భంగా ఎన్టీఆర్ ఇచ్చిన బైట్ ఫ్యాన్స్ ని షాక్ కి గురి చేసింది. ఆయన ఫేస్ లో మునుపటి కళ కనిపించలేదు. దీంతో 'డ్రాగన్'లో లుక్ ఎలా ఉంటుందోననే ఆందోళన ఫ్యాన్స్ లో మొదలైంది. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చాడు.

ఎన్టీఆర్ ఎయిర్ పోర్ట్ నుండి బయటకు వస్తున్న వీడియో క్లిప్ ఒకటి ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఎన్టీఆర్ లుక్ అదిరిపోయింది. ఫిట్ బాడీ, గుబురు గడ్డం, మీసకట్టుతో ఆయన కొత్త లుక్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రశాంత్ నీల్ ఎవరి ఊహకి అందని లుక్ డిజైన్ చేశాడని, ఈ లుక్ తో ఎలివేషన్స్ పడితే.. బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయమని అభిమానులు మురిసిపోతున్నారు.

మొత్తానికి ఎన్టీఆర్ లుక్ గురించి కొద్దిరోజులుగా జరుగుతున్న చర్చకు ఒక చిన్న వీడియో క్లిప్ చెక్ పెట్టింది.