English | Telugu

ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ గొడవ.. అసలు మేటర్ బయటకొచ్చింది!

నీల్ తో ఎన్టీఆర్ గొడవ నిజమేనా?
డ్రాగన్ షూటింగ్ బ్రేక్ కి కారణమేంటి?
తెరవెనుక ఏం జరుగుతోంది?

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'డ్రాగన్'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఫిల్మ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ మూవీ షూటింగ్ సమయంలో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మధ్య మనస్పర్థలు వచ్చాయని.. అందుకే షూటింగ్ కి బ్రేక్ వచ్చిందని ప్రచారం జరిగింది. తాజాగా ఈ విషయంపై ఓ క్లారిటీ వచ్చింది. (NTR Neel)

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో కావడంతో.. ప్రకటనతోనే 'డ్రాగన్'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎన్టీఆర్ లాంటి తిరుగులేని మాస్ హీరోని ప్రశాంత్ నీల్ ఏ రేంజ్ లో చూపిస్తాడనే ఆసక్తి అందరిలో నెలకొంది. అలాంటిది ఈ మూవీ షూట్ స్టార్ట్ అయిన కొద్దిరోజులకే బ్రేక్ వచ్చింది. ప్రశాంత్ నీల్ వర్క్ తో సంతృప్తి చెందని ఎన్టీఆర్ కొన్ని సూచనలు చేశాడని, దాంతో నీల్ హర్ట్ అయ్యాడని.. అలా ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని ప్రచారం జరిగింది. హీరో, డైరెక్టర్ మధ్య మనస్పర్థల కారణంగానే.. 'డ్రాగన్' షూటింగ్ కి బ్రేక్ పడిందని బలంగా వార్తలు వినిపించాయి. ఈ వివాదం ముదిరితే.. పూర్తిగా సినిమా ఆగిపోయినా ఆశ్చర్యంలేదని కూడా కొందరు ప్రచారం చేశారు. (Dragon)

Also Read: మాస్ జాతరకు షాకింగ్ కలెక్షన్స్..!

నిజానికి ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మంచి ఫ్రెండ్స్. అలాంటిది వారి మధ్య విభేదాలు తలెత్తాయనే వార్త అందరినీ షాక్ కి గురి చేసింది. ఈ క్రమంలోనే.. ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందనే వార్తల్లో వాస్తవం లేదని కొందరు అభిప్రాయపడ్డారు. మరికొందరైతే 'డ్రాగన్' స్క్రిప్ట్ తుది మెరుగులు దిద్దడం కోసమే.. ప్రశాంత్ నీల్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చాడని చెప్పుకొచ్చారు.

అయితే 'డ్రాగన్' మూవీ షూటింగ్ కి బ్రేక్ రావడానికి అసలు కారణం ఏంటనేది తాజాగా రివీల్ అయింది. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. స్క్రిప్ట్ వర్క్ కోసమే బ్రేక్ తీసుకున్నారట. అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే 'డ్రాగన్' మూవీని రెండు పార్టులుగా తెరకెక్కించబోతున్నారట.

ప్రశాంత్ నీల్ గత చిత్రాలు 'కేజీఎఫ్', 'సలార్'లా కాకుండా.. 'డ్రాగన్'ను ఒకే సినిమాగా చేయాలని నిర్ణయించుకున్నట్లు మొదట్లో వార్తలొచ్చాయి. అందుకు తగ్గట్టుగానే షూటింగ్ కూడా మొదలుపెట్టారు. అయితే, ఈ సినిమా రన్ టైం ఏకంగా 3 గంటల 45 నిముషాల వరకు వస్తుందట. అంత నిడివితో ఒకే సినిమాగా చేయడం రిస్క్ అని భావించి.. ఎన్టీఆర్, నీల్ చర్చించి.. రెండు భాగాలుగా చేయాలని నిర్ణయించారట. ఆ నిర్ణయానికి తగ్గట్టుగానే ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందట. అంతేకాదు, డ్రాగన్ రెండు భాగాలను ఒకేసారి షూట్ చేసి.. కొన్ని నెలల గ్యాప్ లోనే విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. ఓ రకంగా ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.