English | Telugu

ఆగస్ట్ 12 నుండి యన్ టి ఆర్ కొత్త మూవీ

ఆగస్ట్ 12 నుండి యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా కొత్త మూవీ ప్రారంభం కానుందని సమాచారం. వివరాల్లోకి వెళితే పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, ఎ-1 స్టార్ యన్ టి ఆర్ హీరోగా, శ్రీను వైట్ల దర్శకత్వంలో గణేష్ ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని రానున్న ఆగస్ట్ నెలలో పన్నెండవ తేదీన ప్రారంభిస్తారని తెలిసింది. ప్రస్తుతం యన్ టి ఆర్ సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో, తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న చిత్రంలోనూ, బోయపాటి శీను దర్శకత్వంలో, శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రంలోనూ సైమల్‍ టేనియస్ గా నటిస్తున్నారు.


ఈ రెండు చిత్రాలూ ఆగస్టుకి దాదాపు ముగింపు దశకు చేరుకుంటాయి. అప్పటికి అంటే ఆగస్ట్ 12 నుండి యన్ టి ఆర్ కొత్త మూవీ ప్రారంభిస్తారని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. శ్రీను వైట్ల సినిమాల్లో కామేడీకి పెద్ద పీట వేస్తాడు. యన్ టి ఆర్ కామెడీ చేయటంలో ఘనుడు. అందుకు ఉదాహరణగా ప్రస్తుతం "అదుర్స్" చిత్రంలో ఆచారి పాత్రను చెప్పుకోవచ్చు. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చే ఈ చిత్రంలో ప్రేక్షకులకు ఎంటర్ టైన్ మెంట్ కి కొదువ ఉండదని ఘంటాపధంగా చెప్పవచ్చు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.