English | Telugu

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని..!

సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా, మహేష్ బాబు బావగా సినీ పరిశ్రమకు పరిచయమైన సుధీర్ బాబు.. కెరీర్ స్టార్టింగ్ లో విభిన్న చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షించాడు. చూడటానికి బాగుంటాడు, ఫిట్ గా ఉంటాడు, యాక్షన్ తో పాటు డ్యాన్స్ లు కూడా అదరగొడతాడు. అయితే ఇన్ని క్వాలిటీస్ ఉన్నప్పటికీ.. హీరోగా మాత్రం నిలదొక్కుకోలేకపోతున్నాడు. (Sudheer Babu)

2010లో వచ్చిన 'ఏ మాయ చేసావే' సినిమాతో మొదటిసారి స్క్రీన్ పై మెరిసిన సుధీర్ బాబు.. 2012లో 'SMS' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా మొదటి సినిమాతోనే ఆకట్టుకున్న ఆయన.. ఆ తర్వాత వచ్చిన హారర్ కామెడీ ఫిల్మ్ 'ప్రేమకథా చిత్రమ్'తో బిగ్ సక్సెస్ చూశాడు. దాంతో ఇక సుధీర్ బాబు హీరోగా నిలదొక్కుకున్నట్టే అని, తన మార్కెట్ ని పెంచుకుంటూ మీడియం రేంజ్ హీరో స్థాయికి ఎదుగుతాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ, సుధీర్ కెరీర్ అందుకు భిన్నంగా సాగుతోంది.

సుధీర్ బాబు కెరీర్ ఒక అడుగు ముందుకి, నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టుగా నడుస్తోంది. 'ప్రేమకథా చిత్రమ్' తర్వాత ఎక్కువగా ఫ్లాప్ లే పలకరించాయి. 'భలే మంచి రోజు', 'సమ్మోహనం' లాంటి అతి తక్కువ విజయాలే చూశాడు. కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, శమంతకమణి, నన్ను దోచుకుందువటే, శ్రీదేవి సోడా సెంట‌ర్ వంటి సినిమాలు మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ.. కమర్షియల్ గా మాత్రం కాసుల వర్షం కురిపించలేకపోయాయి.

Also Read:జటాధర మూవీ రివ్యూ

15 ఏళ్ళ కెరీర్ లో దాదాపు 20 సినిమాలు చేసిన సుధీర్ బాబు.. కమర్షియల్ గా ఐదు సక్సెస్ లను కూడా చూడలేకపోయాడు. ముఖ్యంగా గత కొన్నేళ్లలో ఆయన నటించిన.. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, హంట్, మామా మశ్చీంద్ర వంటి సినిమాలు ఎప్పుడొచ్చాయో ఎప్పుడు పోయాయో కూడా మెజారిటీ ఆడియన్స్ కి తెలియదు.

'ప్రేమకథా చిత్రమ్' తర్వాత సుధీర్ బాబు మార్కెట్ పెరిగిపోతుంది అనుకుంటే.. రోజురోజుకి పడిపోతుంది. కొన్ని సినిమాలకు కనీస ఓపెనింగ్స్ కూడా రావట్లేదు. మరి కొన్ని సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా.. కమర్షియల్ గా వర్కౌట్ అవ్వట్లేదు.

'సమ్మోహనం' తర్వాత ఓ సాలిడ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న సుధీర్ బాబు.. తాజాగా 'జటాధర'(Jatadhara)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ తోనైనా హిట్ కొడతాడు అనుకుంటే.. మొదటి షో నుండే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.

టాలెంట్ ఉంది. ఫిల్మోగ్రఫీలో కొన్ని మంచి సినిమాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ సుధీర్ మార్కెట్ పెరగడంలేదు. పైగా ఇటీవల వరుస పరాజయాలు ఆయనను మరింత వెనక్కి లాగుతున్నాయి. మరి సుధీర్ బాబుకి త్వరలో మంచి రోజులు వస్తాయేమో చూడాలి.

ప్రియుడి ఫోటోలు డిలీట్ చేసిన హీరోయిన్.. పెళ్లి క్యాన్సిల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అలవైకుంఠ పురం' సాధించిన విజయం తెలిసిందే. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ కేటగిరి లో మెరిసిన భామ 'నివేత పేతురేజ్'. ఈ ఏడాది ఆగష్టులో సోషల్ మీడియా వేదికగా నివేత మాట్లాడుతు నేను దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రజిత్ ఇబ్రాన్ తో  రిలేషన్ లో ఉన్నట్టుగా వెల్లడి చేసింది. వెల్లడి చెయ్యడమే కాదు ఇంట్లో పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయని వచ్చే ఏడాది జనవరిలోనే మ్యారేజ్ ఉంటుందని చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులతో పాటు పలువురు నెటిజన్స్ నివేత కి కంగ్రాట్స్ చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పెళ్లి పెళ్లి పీటల వరకు వెళ్లేలా లేదనే అనుమానాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.