English | Telugu
వారణాసి సెట్స్ కి జేమ్స్ కామెరూన్.. టైగర్స్ తో షూట్!
Updated : Dec 17, 2025
బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో తెలుగు సినిమాని ప్రపంచస్థాయికి తీసుకెళ్ళారు దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli). ఇప్పుడు ఆయన మహేష్ బాబుతో 'వారణాసి'(Varanasi) అనే భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ సెట్స్ చూడాలని ఉందని.. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ చెప్పడం ఆసక్తికరంగా మారింది.
జేమ్స్ కామెరూన్(James Cameron) సృష్టించిన అద్భుతాలలో 'అవతార్' ఒకటి. ఇప్పటికే రెండు భాగాలు విడుదలై, వరల్డ్ సినిమాలో ఎన్నో రికార్డులు సృష్టించాయి. ఇప్పుడు మూడో భాగంగా 'అవతార్: ఫైర్ అండ్ యాష్' డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. (Avatar: Fire and Ash)
Also Read: 'అఖండ-2' సక్సెస్ మీట్ కి పవన్ కళ్యాణ్!
తాజాగా భారత్ లో రాజమౌళి సహా పలువు సినీ ప్రముఖులకు 'అవతార్-3' చూపించారు. అనంతరం రాజమౌళి, కామెరూన్ వీడియో కాల్ ద్వారా ముచ్చటించారు. రాజమౌళి మాట్లాడుతూ.. అవతార్-3 లో విజువల్స్, పాత్రలను తీర్చిదిద్దిన తీరు అద్భుతమని కొనియాడారు. థియేటర్లో ఒక చిన్న పిల్లాడిలా సినిమాని ఎంజాయ్ చేశానని చెప్పారు.
ఈ సందర్భంగా రాజమౌళిని 'వారణాసి' సినిమా వివరాలు అడిగి తెలుసుకున్నారు కామెరూన్. ఏడాదిగా షూటింగ్ జరుగుతోంది, మరో ఏడెనిమిది నెలలు షూటింగ్ ఉంటుందని రాజమౌళి తెలిపారు. ఈ క్రమంలో వారణాసి షూటింగ్, సెట్స్ చూడాలని ఉందని కామెరూన్ చెప్పడంతో రాజమౌళి తెగ సంబరపడ్డారు. అలాగే, ఆర్ఆర్ఆర్ సినిమాని గుర్తు చేస్తూ.. పులులతో ఏదైనా షూట్ ప్లాన్ చేస్తుంటే చెప్పు అని కామెరూన్ అనడంతో.. రాజమౌళి ముఖంలో నవ్వులు పూశాయి.