English | Telugu
హీరో చేత సిగరెట్ పారేయించిన అభిమాని.. అంతా శివుడి మహిమ
Updated : Oct 4, 2025
తెలుగు సినిమా ఖ్యాతిని పెంచే చిత్రాలు రావడం అనేది చాలా అరుదు. తెలుగు సినిమా గతిని, నడవడికని కూడా ఆ చిత్రాలు మార్చగలవు. పైగా అలాంటి చిత్రాలు రావాలంటే దైవసంకల్పం తోడవ్వాలనే మాట కూడా ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో వినిపిస్తుంది. అలాంటి ఒక చిత్రమే 'శంకరాభరణం'(Sankarabharanam).1980 ఫిబ్రవరి 2 న ప్రేక్షకుల ఆశీర్వాదాలు కోరుతు వచ్చిన ఈ మూవీ నేటికీ ఆశీర్వాదాలు పొందుతూనే ఉంది.
మ్యూజికల్ డ్రామాగా తెరకెక్కిన 'శంకరాభరణం'లో టైటిల్ రోల్ 'శంకరశాస్త్రి' క్యారక్టర్ ని సోమయాజులు(JV Somayajulu)గారు అత్యద్భుతంగా పోషించారు. సదరు క్యారక్టర్ సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తున్నంత సేపు సోమయాజులు గారు కనపడరు. శంకర శాస్త్రే మన కళ్ళ ముందు మెదులుతు ఉంటారు. అంతలా సోమయాజులు గారు తమ నటనతో మెప్పించారు. ఆ ప్రభావం ప్రేక్షకులపై ఎంతలా చూపించిందంటే, సోమయాజులు గారు శంకర భరణం రిలీజైన కొన్ని రోజుల తర్వాత సిగరెట్ తాగుతు బయట కనపడ్డాడు. ఒక అభిమాని సోమయాజులుగారితో 'శంకర శాస్త్రి గారు మీరు సిగరెట్ తాగడం బాగోలేదు. దయ చేసి పారెయ్యండని అన్నాడు.అది సినిమా అని సోమయాజులు గారు ఎంత చెప్పినా వినకుండా, సిగరెట్ పారేసిన దాకా సదరు వ్యక్తి వాదన చేసాడు.దాంతో సిగిరెట్ పడేసారు. దాంతో సోమయాజులు గారు చాలా కాలం పాటు బయట సిగరెట్ తాగడం మానేశారు. దీన్నిబట్టి శంకరశాస్త్రి పాత్ర ఎంతలా ప్రభావం చూపించిందో అర్ధం చేసుకోవచ్చు.
సోమయాజులు గారితో పాటు మిగతా క్యారక్టర్ లలో చేసిన మంజుభార్గవి, చంద్రమోహన్, అల్లు రామలింగయ్య తమ క్యారక్టర్ లలో జీవించి 'శంకరాభరణం'కి మరింత నిండుతనాన్ని తెచ్చారు. లెజండ్రీ డైరెక్టర్ 'కె విశ్వనాధ్' దర్శకత్వప్రతిభ ప్రతి ఫేమ్ లోను కనిపిస్తుంది. జంధ్యాల మాటలు, ఏడిద నాగేశ్వరరావు నిర్మాణ విలువలు మరింత వన్నె తెచ్చాయి. పాన్ ఇండియా లెవల్లో తమిళ, మలయాళ భాషల్లోను ఘన విజయాన్ని అందుకొని, ఎన్నో సెంటర్స్ లో వంద రోజులని జరుపుకుంది. సాంగ్స్ కూడా హైలెట్ గా నిలిచి నేటికీ చాలా చోట్ల మారుమోగిపోతుంటాయి. ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డ్స్ ని సైతం అందుకుంది.