English | Telugu
హరిహర వీరమల్లు పై హైపర్ ఆది కామెంట్స్
Updated : Jul 24, 2025
పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)మొదటిసారి చేసిన చారిత్రాత్మక చిత్రం 'హరిహరవీరమల్లు'(Harihara Veeramallu)ఈ రోజు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. నిన్న రాత్రి నుంచే ప్రీమియర్ షోస్ ప్రదర్శించడంతో థియేటర్స్ దగ్గర పండగ వాతావరణం నెలకొని ఉంది. రీసెంట్ గా ప్రముఖ నటుడు 'హైపర్ ఆది'(Hyper Aadi)సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో రిలీజ్ చేసాడు.
అందులో ఆయన మాట్లాడుతు నిన్నరాత్రి 'హరిహరవీరమల్లు' ప్రీమియర్ షో చూసాను. సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు మీ ఫ్యామిలీ తో పాటు థియేటర్ కి వెళ్లి చూడండి. పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్ కే మీరు తెచ్చుకున్న పేపర్స్ మొత్తం అయిపోతాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో పవన్ గారు కంపోజ్ చేసిన యాక్షన్ సీన్, కీరవాణి గారు అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. షూటింగ్ జరుగుతున్నప్పుడు చాలాసార్లు నేను సెట్స్ కి వెళ్ళాను. అభిమానులకి నచ్చేలా సినిమా అందించాలని, ప్రతి సీన్ విషయంలో పవన్ చాలా జాగ్రత్త తీసుకోవడాన్ని గమనించాను. అది ఈ రోజు స్క్రీన్ పై కనిపించిందని చెప్పుకొచ్చాడు.
వీరమల్లు కి 'క్రిష్',(Krish),'జ్యోతికృష్ణ'(Jyothi Krishna)సంయుక్తంగా దర్శకత్వం వహించగా 'ఏఎంరత్నం'(Am Rathnam)ఆయన సోదరుడు 'దయాకర్'(Dayakar) భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఆ భారీ తనం మొత్తం స్క్రీన్ పై కనపడుతుందని మూవీ చూసిన చాలా మంది ప్రేక్షకులు చెప్తున్నారు. ఔరంగ జేబుగా బాబీడియోల్(Bobby deol)పంచమిగా నిధి అగర్వాల్(Nidhhi Agerwal)తమ క్యారెక్టర్స్ లో ఒదిగిపోయారని, మిగతా పాత్రల్లో చేసిన నటినటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించారని చాలా మంది ప్రేక్షకులు చెప్తున్నారు. కీరవాణి(Keeravani)అందించిన మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వీరమల్లు కి అదనపు బలాన్ని ఇచ్చిందనే అభిప్రాయాన్ని కూడా చాలా మంది ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు.