English | Telugu

హీరోయిన్లు ఎదుర్కున్న లైంగిక సమస్యల కేసుని మూసివేసిన హైకోర్ట్.. సాక్ష్యాధారాలు లేవంటా! 

మలయాళ చిత్ర రంగంలో నటీమణులు ఎదుర్కుంటున్న లైంగిక ఇబ్బందులతో పాటు వర్క్ కి సంబంధించిన పలు సమస్యలపై కేరళ ప్రభుత్వం 'జస్టిస్ హేమ కమిటీ ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో హేమ కమిటీ(Hema Committee)కి చెందిన సభ్యులు మలయాళ చిత్ర పరిశ్రమపై పూర్తి అధ్యయనం చేసి, పరిశ్రమలో మహిళలు పలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని నిర్దారించారు. అందుకు సంబంధించి సుమారు 235 పేజీల రిపోర్ట్ తో కూడిన నివేదికని కేరళ ప్రభుత్వానికి సమర్పించింది. దీంతో పలువురు మాజీ, కొత్త నటీమణులు మలయాళ చిత్ర సీమలో తాము ఎదుర్కున్న లైంగిక సమస్యలని బహిరంగంగా వెల్లడించారు. ఈ ఆరోపణలు కేరళలో సంచలనం సృష్టించాయి. దీంతో అగ్ర హీరో మోహన్ లాల్(Mohan Lal)సైతం 'అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్(AMMA) పదవికి రాజీనామా చేసాడు.

ఇక హేమ కమిటీ నివేదిక ఆధారంగా మొత్తం ముప్పై ఐదు కేసులు నమోదయ్యాయి. వీటిని దర్యాప్తు చేసేందుకు కోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం 'సిట్'(Sit)ఏర్పాటయ్యింది. తాజాగా 'సిట్' కేరళ హైకోర్ట్ తో హేమ కమిటీ నివేదిక ఆధారంగా నమోదైన ముప్పై ఐదు కేసులకు సంబంధించి వాంగ్మూలం ఇచ్చేందుకు బాధితులెవరు ముందుకు రావడం లేదు. కాబట్టి ఆ కేసులన్నింటినీ మూసి వేస్తున్నామని సిట్ తెలిపింది. సిట్ నివేదికపై దర్యాప్తు చేసిన న్యాయస్థానం ప్రస్తుతానికి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని నమోదైన కేసుల్ని మూసివేయమని కోర్టు ఆదేశించింది.