English | Telugu
హీరోని కుక్కతో పోల్చిన దర్శక నిర్మాత
Updated : Jan 20, 2024
సుమారు 100 కి పైగా తమిళ చిత్రాల్లో కమెడియన్ గా నటించి తన సూపర్ టైమింగ్ తో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించిన నటుడు సూరి (soori)ఆయన నటించిన చాలా చిత్రాలు తెలుగులో కి కూడా డబ్ అవ్వడంతో తెలుగు ప్రేక్షకులకి కూడా సూరి పరిచయమే. తాజాగా ఆయనకి సంబంధించిన ఒక న్యూస్ సంచలనం సృష్టిస్తుంది.
సూరి కమెడియన్ గానే కాకుండా హీరోగా కూడా రాణిస్తు తన సత్తా చాటుతున్నాడు. గత సంవత్సరం విడుదలై మూవీతో ఘన విజయాన్ని అందుకున్న సూరి తాజాగా గరుడన్(garudan)అనే మూవీతో మరోసారి హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ మూవీ టీజర్ ఇటీవలే రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ఈ టీజర్ లోనే హీరోని విశ్వాసంగా ఉండే కుక్కతో పోల్చుతు డైలాగ్స్ చెప్పించారు. యువన్ శంకర్ రాజా సృష్టించిన ఒక అధ్బుతమైన ఆర్ఆర్ లో టీజర్ ని చూస్తున్నంత సేపు కూడా సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే క్యూరియాసిటీ ప్రతి ఒక్కరికి కలుగుతుంది.అలాగే సూరి కూడా తన యజమాని కోసం ఒకడ్ని పట్టుకోవడానికి సీరియస్ లుక్ తో పరుగెడుతుండటం ఐతే సూపర్ గా ఉంది.
సూరి తో పాటు శశి కుమార్ ,ఉన్ని ముకుందన్ లు కూడా టీజర్ లో కనిపించారు. పక్కా మాస్ మూవీగా గరుడన్ అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకి ఉన్న ఇంకో స్పెషల్ ఏంటంటే ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలని తెరకెక్కించి దర్శకత్వ పోస్ట్ కే వన్నె తెచ్చిన వెట్రిమారన్ (vetrimaaran) ఈ గరుడన్ చిత్రానికి కథ ని అందించాడు. ఆర్ ఎస్ దొరై సెంథిల్ కుమార్ దర్శకత్వాన్ని వహించాడు.