English | Telugu
అల్లు అర్జున్ సినిమాలో ఇక నటించను.. గబ్బర్ సింగ్ సాయి సంచలన నిర్ణయం
Updated : Jul 13, 2024
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (pawan kalyan)హీరోగా 2012 లో వచ్చిన మూవీ గబ్బర్ సింగ్. అందులోని అంత్యాక్షరి ఎపిసోడ్ ఎంత పాపులరో అందరకి తెలిసిన విషయమే. ఆ సీక్వెన్స్ కోసం రిపీటెడ్ గా చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. పోలీసు స్టేషన్ లో జరిగిన ఆ అంత్యాక్షరి పవన్ కి ఎంత పేరు తెచ్చిందో, అందులో నటించిన వాళ్లకి కూడా అంతే పేరు తెచ్చింది. అలాంటి వాళ్ళలో ఒకరు సాయి. రీసెంట్ గా ఆయన అల్లు అర్జున్ విషయంలో తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టిస్తుంది.
ఇటీవల సాయి(gabbar singh sai)ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు అల్లు అర్జున్ మొదటి సినిమా నుంచి ఆయన్ని మెగా ఫ్యామిలీ లో ఒక నెంబర్ గా అనుకున్నాను. మెగా హీరోగా ఓన్ చేసుకొని ఆయన ప్రతి సినిమాని కూడా చూసాను. అలాగే నాలాగే ఎంతో మంది అనుకోని ఉంటారు. అందుకే అల్లు అర్జున్ నెంబర్ వన్ హీరో రేంజ్ కి ఎదిగాడు. కానీ మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అల్లు అర్జున్ వైసిపీ పార్టీ తరుపున పోటీ చేసిన వ్యక్తి కి సపోర్ట్ గా నిలిచాడు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక పై అల్లు అర్జున్ సినిమాల్లో నటించను. కాకపోతే అల్లు అర్జున్ ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ మధ్య ఎలాంటి పొరపచ్చాలు ఉండకూడదు. ఆ రెండు కుటుంబాలు కలిసి ఉండాలని కోరుకుంటున్నానని చెప్పాడు. అదే విధంగా నాగబాబు గతంలో చెప్పిన ఒక మాటని కూడా గుర్తు చేసాడు. మనోడు అయినా పరాయి వాళ్లకి పని చేసేవాడు మనోడు కాదు. పరాయి వాడైనా మనకి పని చేసే వాడు మనోడే అనే విషయాన్ని చెప్పాడు. అందుకే పుష్ప 2 లో అవకాశం వచ్చినా కూడా చేయలేదని వెల్లడి చేసాడు.
ఇక సాయి విషయానికి వస్తే..పవన్ కళ్యాణ్ ని చాలా ఇష్టపడతాడు. పవన్ కోసం ఏమైనా చెయ్యడానికి, ఎంతటి వారినైనా ఎదుర్కోవడానికీ రెడీ అంటాడు. అవసరమైతే పవన్ కోసం చనిపోవడానికి చంపడానికి కూడా సిద్దమని చెప్తాడు. మొన్న జరిగిన ఎలక్షన్స్ లో పవన్ తరుపున ప్రచారం కూడా చేసాడు.