English | Telugu

రోజా, పోసాని టార్గెట్ మెగా ఫ్యామిలీ... అల్లు అర్జున్ ఎంకరేజ్ చేస్తాడా?

మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)తెలుగు సినిమారంగంలో గత నలభై ఏళ్లుగా తన హవాని కొనసాగిస్తు వస్తున్నాడు. నేటికీ నెంబర్ వన్ హీరో చిరంజీవినే అని చెప్పుకోవచ్చు. ఇక ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తు పవన్ కళ్యాణ్(pawan kalyan)రామ్ చరణ్(ram charan)అల్లు అర్జున్(alu arjun)వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ వంటి హీరోలు వచ్చారు. సినీ భాషలో ఆ అందర్నీమెగా ఫ్యామిలీ గా సంబోధిస్తుంటారు. రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక విషయం పై చర్చ జరుగుతుంది.

మెగా ఫ్యామిలీ తో పెట్టుకుంటే ఇక ఆ నటుడి సినీ ప్రయాణం ముగిసిపోయినట్టే అనే మాటలు చాలా రోజుల నుంచి సినీ పరిశ్రమతో పాటు సినీ అభిమానుల్లో వినిపిస్తుంటాయి.ఇందుకు ఉదాహరణగా పాత తరం నుంచే చాలా మంది ఆర్టిస్ట్ లు, నిర్మాతలు, దర్శకులు ఉన్నారు. ఇక ఇప్పుడు ఫ్రెష్ గా రోజా(roja)అలీ, పోసాని(posani)యాంకర్ శ్యామల ఆ లిస్ట్ లో తమ స్థానాన్ని పదిలపరుచుకోబోతున్నారనే వార్తలు వస్తు యి. అసలు విషయంలోకి వస్తే ఆ నలుగురు జగన్ నేతృత్వంలోని వైసీపి కి సపోర్ట్ గా ఉంటు వస్తున్నారు. మొన్న జరిగిన ఎలక్షన్ లో వైసీపీ ఓడిపోవడంతో ఇక రాజకీయ నిరుద్యోగులు అయ్యారు.దీంతో మళ్ళీ సినిమాల్లో నటించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. కాకపోతే ఏ నిర్మాత, దర్శకుడు, హీరో కానీ వాళ్లకి సినిమాల్లో అవకాశం ఇవ్వరనే మాటలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు కారణం వాళ్ళు ఎప్పటినుంచో మెగా ఫ్యామిలీ మీద విమర్శలు చేస్తు వస్తున్నారు.వైసీపీ కి వంత పాడుతు పవన్ తో పాటు ఆయన స్థాపించిన జనసేన పార్టీని చాలా దారుణంగా తిడుతు వస్తున్నారు.

ఈ కారణంతోనే వాళ్ళకి సినిమాల్లో ఇక అవకాశాలు రావని తెలుస్తుంది. ఎందుకంటే పవన్ ఇప్పుడు అధికారంలో ఉన్నాడు. పైగా డిప్యూటి సిఏం కూడా.. దీంతో ఒకరు ఇద్దరు అవకాశం ఇద్దామని అనుకున్నా కూడా రిస్క్ చెయ్యడం ఎందుకని ఆలోచిస్తారని తెలుస్తుంది. ఒక రకంగా ఆ నలుగురి సినీ కెరీర్ క్లోజ్ అయ్యిందని కూడా అంటున్నారు. సోషల్ మీడియాలో ఇంకో న్యూస్ కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇటీవల మెగా అభిమానుల ఆగ్రహానికి గురయ్యిన అల్లు అర్జున్ తన సినిమాల్లో ఆ నలుగురికి అవకాశం ఇస్తాడేమో అని కామెంట్స్ చేస్తున్నారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.