English | Telugu
చంద్రమోహన్ మృతిపై స్పందించిన చిరు, బాలయ్య, పవన్,ఎన్టీఆర్
Updated : Nov 11, 2023
ప్రముఖ సీనియర్ నటులు చంద్రమోహన్ ఈ రోజు హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చంద్రమోహన్ గారి లాంటి మల్టీ పర్పస్ ఆర్టిస్ట్ మరొకరు పుట్టరని ఎన్నో చిత్రాల్లో ఎన్నో విభిన్నమైన పాత్రలని పోషించి ఆ పాత్రలకి వన్నె తెచ్చారని అంటూ చిత్రపరిశ్రమకి చెందిన పలువురు సినీ ప్రముఖులు ఆయన కుటుంబానికి తమ ప్రధాన సానుభూతిని తెలియచేసారు.
చిరంజీవి, నందమూరి బాలకృష్ణ,వెంకటేష్, రామ్ చరణ్, ఎన్టీఆర్,నాని, ప్రముఖ నటులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ,మంచు విష్ణు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ ఇలా తదితర సినిమా ప్రముఖులందరూ ట్విటర్ వేదికగా తమ సానుభూతిని తెలియచేసారు. బాలకృష్ణ అయితే చంద్రమోహన్ గారితో తనకి తన తండ్రి నందమూరి తారకరామారావు కి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తు ఒక ప్రెస్ నోట్ ని కూడా రిలీజ్ చేసాడు.ఆ నోట్ లో చంద్రమోహన్ గారు ఎన్నో సాంఘిక ,పౌరాణిక చిత్రాల్లో అద్భుతంగా నటించి ఆయనకి ఆయనే సాటి అని అనిపించుకున్నారని తన తండ్రితో యుగపురుషుడు ,ధనమా దైవమా,నిండు మనుసులు అలాగే తనతో ఆదిత్య 369 సినిమాలో అద్భుతంగా నటించారని ఆనాటి విషయాలని మరోసారి గుర్తు చేసుకున్నారు.