Read more!

English | Telugu

రాజోలులో రూ.40 లక్షలతో ఆక్సిజన్‌ ప్లాంట్‌.. శభాష్ సుకుమార్

దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఆక్సిజన్ దొరకక కరోనా బాధితులు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ సుకుమార్ తన వంతుగా సాయం చేయడానికి ముందుకొచ్చారు. కరోనాతో బాధపడుతూ ఆక్సిజన్‌ దొరకక అవస్థలు పడుతున్న బాధితుల ప్రాణాలను కాపాడేందుకు శాశ్వత ప్రాతిపదికన ఆక్సిజన్‌ జనరేటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకొన్నారు.

సుకుమార్ తన స్వస్థలమైన కాకినాడ సమీపంలోని రాజోలు గ్రామంలో రూ.40 లక్షల వ్యయంతో డిప్లాయబుల్ ఆక్సిజన్ కాన్సెంట్రేషన్ సిస్టమ్‌(DOCS) 80 ఆక్సిజన్‌ జనరేటర్‌ సిస్టమ్‌ ప్లాంట్‌ నిర్మించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. రాజోలులో ఈ ప్లాంట్‌ నిర్మాణం తక్షణమే చేపట్టి నాలుగురోజుల్లో పూర్తిచేసేలా ఏర్పాటు చేస్తున్నారు.

కోనసీమలోని కరోనా బాధితులకు ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందించేందుకు సుకుమార్ ఇప్పటికే ముందుకు వచ్చారు. తొలుత ఆయన రూ.25 లక్షలతో ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందించాలనుకున్నారు. కానీ ఆక్సిజన్‌ ప్లాంట్‌ నిర్మిస్తే అవసరానికి తగిన ఆక్సిజన్‌ తయారుచేసుకోవచ్చన్న ఉద్దేశంతో మరో రూ.15 లక్షలు జత చేసి మొత్తం రూ.40 లక్షలతో ఆక్సిజన్‌ ప్లాంట్‌ నిర్మిస్తున్నారు. సుకుమార్‌ సేవాగుణాన్ని టాలీవుడ్‌ ప్రముఖులతో పాటు కోనసీమ ప్రజలు అభినందిస్తున్నారు.