English | Telugu

ఆ చైల్డ్ ఆర్టిస్ట్ హీరోగా వ‌స్తున్నాడు!

బాహుబలి, రేసుగుర్రం, మళ్లీ రావా, దువ్వాడ జగన్నాథం, నా పేరు సూర్య లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో బాల నటుడిగా నటించినసాత్విక్ వర్మ ఇప్పుడు మన ముందుకు హీరో గా మనల్ని మరింత ఎంటర్టైన్ చేయటానికి 'బ్యాచ్' చిత్రంతో మన ముందుకు వస్తున్నాడు. ఆకాంక్ష మూవీ మేకర్స్ పతాకంపై ర‌మేశ్ ఘ‌న‌మ‌జ్జి నిర్మిస్తున్న ఈ చిత్రానికి శివ ద‌ర్శ‌కుడు. సాత్విక్ వ‌ర్మ స‌ర‌స‌న నాయిక‌గా నేహా ప‌ఠాన్ న‌టిస్తోంది. ర‌ఘు కుంచే సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. మ్యూజిక‌ల్ యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్ పూర్త‌యి, ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది.

షూటింగ్ పూర్తయిన సందర్భంగా దర్శకుడు శివ మాట్లాడుతూ "మా 'బ్యాచ్' ఒక యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం. యూత్ కి కావాల్సిన అన్ని అంశాలతో చిత్రాన్ని నిర్మించాము. క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలోకాలేజీ బ్యాక్ డ్రాప్ లో కొందరు పోకిరి కుర్రాళ్ల కథే మా సినిమా." అని తెలిపారు.

నిర్మాత రమేష్ ఘనమజ్జి మాట్లాడుతూ "దర్శకుడు శివ చెప్పిన కథ బాగా నచ్చింది.మా చిత్రంతో బాలనటుడు సాత్విక్ వర్మని హీరో గా పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం జనవరి లో షూటింగ్ మొదలు పెట్టి హైదరాబాద్, విశాఖపట్నం మరియు కాకినాడ వంటి పరిసర ప్రాంతాల్లో 59 రోజుల్లో పూర్తి చేశాం. మా సినిమాకి సంగీత దర్శకుడు రఘు కుంచే మరో హీరో. సాత్విక్ వర్మ, రఘు కుంచే కాంబినేషన్ లో వచ్చే పాటలు అద్భుతంగా వచ్చాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలోనే విడుదల చేస్తాం" అని తెలిపారు.

ప్రియుడి ఫోటోలు డిలీట్ చేసిన హీరోయిన్.. పెళ్లి క్యాన్సిల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అలవైకుంఠ పురం' సాధించిన విజయం తెలిసిందే. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ కేటగిరి లో మెరిసిన భామ 'నివేత పేతురేజ్'. ఈ ఏడాది ఆగష్టులో సోషల్ మీడియా వేదికగా నివేత మాట్లాడుతు నేను దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రజిత్ ఇబ్రాన్ తో  రిలేషన్ లో ఉన్నట్టుగా వెల్లడి చేసింది. వెల్లడి చెయ్యడమే కాదు ఇంట్లో పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయని వచ్చే ఏడాది జనవరిలోనే మ్యారేజ్ ఉంటుందని చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులతో పాటు పలువురు నెటిజన్స్ నివేత కి కంగ్రాట్స్ చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పెళ్లి పెళ్లి పీటల వరకు వెళ్లేలా లేదనే అనుమానాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.