English | Telugu

దావూది వీడియో సాంగ్.. ఎన్టీఆర్ ఊర మాస్ ట్రీట్!

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) , జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'దేవర' (Devara). అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ విడుదలయ్యాయి. ఫస్ట్ సింగిల్ గా విడుదలైన ఫియర్ సాంగ్, సెకండ్ సింగిల్ గా విడుదలైన చుట్టమల్లే సాంగ్.. రెండూ కూడా చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఇప్పుడు మూడో సాంగ్ విడుదలైంది. అది కూడా వీడియో సాంగ్ కావడం విశేషం.

'దావూది' (Daavudi) అంటూ సాగే ఈ మూడో సాంగ్ వీడియోని తాజాగా విడుదల చేశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ లో ఎన్టీఆర్-జాన్వీ జోడి అదరగొట్టింది. ముఖ్యంగా ఎన్టీఆర్ అదిరిపోయే స్టెప్పులతో ఫ్యాన్స్ కి, మాస్ ఆడియన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చాడని చెప్పవచ్చు. ఈ సాంగ్ లో ఇంకా ఓ రేంజ్ స్టెప్పులు ఉన్నాయని, వాటిని నేరుగా థియేటర్లో రివీల్ చేస్తామని మేకర్స్ చెబుతున్నారు. ఫియర్ సాంగ్, చుట్టమల్లే సాంగ్ తో ఆకట్టుకున్న అనిరుధ్.. 'దావూది' సాంగ్ కి అందరూ కాలు కదిపేలా మంచి బీట్ ఇచ్చాడు. ఇక రామజోగయ్య శాస్త్రి పాటకు తగ్గట్టుగా క్యాచీ లిరిక్స్ రాశారు. (Devara Songs)

ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'దేవర' సినిమా సెప్టెంబర్ 27న థియేటర్లలో అడుగుపెట్టనుంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, షైన్ టామ్ చాకో తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ప్రియుడి ఫోటోలు డిలీట్ చేసిన హీరోయిన్.. పెళ్లి క్యాన్సిల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అలవైకుంఠ పురం' సాధించిన విజయం తెలిసిందే. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ కేటగిరి లో మెరిసిన భామ 'నివేత పేతురేజ్'. ఈ ఏడాది ఆగష్టులో సోషల్ మీడియా వేదికగా నివేత మాట్లాడుతు నేను దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రజిత్ ఇబ్రాన్ తో  రిలేషన్ లో ఉన్నట్టుగా వెల్లడి చేసింది. వెల్లడి చెయ్యడమే కాదు ఇంట్లో పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయని వచ్చే ఏడాది జనవరిలోనే మ్యారేజ్ ఉంటుందని చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులతో పాటు పలువురు నెటిజన్స్ నివేత కి కంగ్రాట్స్ చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పెళ్లి పెళ్లి పీటల వరకు వెళ్లేలా లేదనే అనుమానాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.