English | Telugu

Fahad Fassil Movie OTT: ఓటీటీలోకి పుష్ప విలన్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ!


తెలుగులో వచ్చిన హారర్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాల కంటే కూడా మలయాళం నుండి వచ్చిన కొన్ని సినిమాలు ఓటీటీలో అదరగొడుతున్నాయి. ఎంతలా అంటే అత్యధిక వ్యూస్ తో రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో మలయాళ సినిమాలకి బాగా క్రేజ్ ఉంది.

క్రైమ్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ తరహా కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి ఓటీటీ సంస్థలు పోటీపడుతూ ఉంటాయి. అలా ఓటీటీ తెరపైకి వస్తున్న మరో మిస్టరీ థ్రిల్లర్ 'ఇరుల్'. మలయాళంలో రూపొందిన ఈ సినిమాకి నసీఫ్ యూసఫ్ ఇజుద్దీన్ దర్శకత్వం వహించాడు. ఆంటోని జోసెఫ్ నిర్మించిన ఈ సినిమాకి, శ్రీరాగ్ సాజీ మ్యూజిక్ అందించాడు. ఫహాద్ ఫాజిల్, దర్శనా రాజేంద్రన్, సౌబిన్ షాహిర్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, 2021 ఏప్రిల్ 2న ఓటీటీ ప్రేక్షకులను పలకరించింది. ఆ సినిమా ఇప్పుడు ఆహా తమిళ్ ఓటీటీలోకి అడుగుపెడుతోంది.

ఆహా తమిళంలో ఈ సినిమాను ఈ నెల 6వ తేదీనుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. ఇదే నెలలో తెలుగులోను ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రానున్నారు. ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ కథలని ఇష్టపడే వారికి ఈ సినిమా ఫీస్ట్ అనే చెప్పాలి. మరి ఇంకెందుకు లేటు రేపు ఓటీటీలోకి వచ్చే ఈ సినిమాని చూసేయ్యండి.

ప్రియుడి ఫోటోలు డిలీట్ చేసిన హీరోయిన్.. పెళ్లి క్యాన్సిల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అలవైకుంఠ పురం' సాధించిన విజయం తెలిసిందే. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ కేటగిరి లో మెరిసిన భామ 'నివేత పేతురేజ్'. ఈ ఏడాది ఆగష్టులో సోషల్ మీడియా వేదికగా నివేత మాట్లాడుతు నేను దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రజిత్ ఇబ్రాన్ తో  రిలేషన్ లో ఉన్నట్టుగా వెల్లడి చేసింది. వెల్లడి చెయ్యడమే కాదు ఇంట్లో పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయని వచ్చే ఏడాది జనవరిలోనే మ్యారేజ్ ఉంటుందని చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులతో పాటు పలువురు నెటిజన్స్ నివేత కి కంగ్రాట్స్ చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పెళ్లి పెళ్లి పీటల వరకు వెళ్లేలా లేదనే అనుమానాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.