English | Telugu

ఇక గుడ్ బై..అందరికి ఇచ్చిపడేసాడు   

ఇక గుడ్ బై..అందరికి ఇచ్చిపడేసాడు   


                                                               
నాలుగున్నర దశాబ్దాల నుంచి తెలుగు చిత్ర సీమలో అగ్ర  హీరోగా కొనసాగుతు, తనదైన నటనతో,డాన్సులతో  కోట్లాది మంది అభిమానులని సంపాదించుకున్నారు మెగా స్టార్ చిరంజీవి.గత ఏడాది ఆయన నుంచి ఏ సినిమా రాకపోయినా కూడా, ఈ ఏడాది మాత్రం విశ్వంభర తో తన సత్తా చాటడానికి సిద్ధం అవుతున్నారు.   రీసెంట్ గా చిరు బ్రహ్మానందం మూవీకి  సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హాజరయ్యారు.ఈ సందర్భంగా  అయన మాట్లాడుతు ఈ మధ్య కాలంలో నేను పొలిటికల్ కి సంబంధించిన పెద్ద పెద్ద వాళ్ళని కలుస్తుంటే, చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడని కొంత మంది అనుకుంటున్నారు.

అలాంటి  డౌట్స్ ఏం పెట్టుకోకండి.ఈ జన్మంతా రాజకీయాలకి దూరంగా ఉంటాను.కళామతల్లి సేవలోనే ఉంటు,మరిన్ని మంచి సినిమాలు చేస్తు ప్రేక్షకులని అలరిస్తాను. పొలిటికల్ గా నేను అనుకున్న భావాలని,లక్ష్యాల్ని ముందుకు తీసుకెళ్లేందుకు నా తమ్ముడు పవన్ కళ్యాణ్ ఉన్నాడని చెప్పుకొచ్చారు. ఇప్పుడు చిరు చేసిన ఈ వ్యాఖ్యలతో బిజెపి లోకి చిరు వెళ్తున్నాడని,ఒక అత్యున్నత పదవిలో చిరు కూర్చోబోతున్నాడనే  వార్తలకి చెక్ పెట్టినట్లయింది.మొన్న జరిగిన లైలా మూవీ ఈవెంట్ లో  కూడా  పవన్ స్థాపించిన పార్టీ తనదే అనే ఉదేశ్యంలో చిరు మాట్లాడిన విషయం తెలిసిందే.దీంతో ఇప్పుడు చిరు మాట్లాడిన మాటలు సినీ సర్కిల్స్ , పొలిటికల్ సర్కిల్స్ లోను హాట్ టాపిక్ గా నిలిచాయి.