English | Telugu
తప్పిపోయిన రామ్ చరణ్ చిలుక విషయంలో ఏం జరిగింది..ఉపాసన ఎందుకు హ్యాపీ
Updated : Feb 12, 2025
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)ఉపాసన(Upasana)దంపతులు జంతు ప్రేమికులనే విషయం అందరకి తెలిసిందే.అరుదైన జాతికి చెందిన'రైమ్'అనే కుక్కపిల్లతో పాటు రకరకాల కుక్కలు,బాద్ షా,కాజల్,బ్లేజ్ అనే గుర్రాలే కాకుండా,పక్షి జాతికి చెందిన రకరకాల పక్షులు కూడా ఉన్నాయి.ఆ పక్షుల్లో 'కుట్టి'(Kutti)అనే ఆఫ్రికన్ గ్రే 'చిలుక' ఉంది.ఆ చిలుక కొన్ని రోజుల క్రితం తప్పిపోయింది.
దీంతో ఉపాసన సోషల్ మీడియా వేదికగా'హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ no 25 లో 'కుట్టి' అనే చిలుక తప్పిపోయింది.ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి అంటు పోస్ట్ చేసింది.ఆ పోస్ట్ చూసిన 'యానిమల్ వారియర్ టీం' 'చిలుక'ని పట్టుకొని 'రామ్ చరణ్'దంపతులకి ఇచ్చారు.అందుకు సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ దంపతులు కూడా వారియర్ టీం కి కంగ్రాట్స్ చెప్పారు.ఇక 'కుట్టిని' ఎలా రెక్కీ చేసి పట్టుకున్నారో అందుకు సంబంధిచిన వివరాలని యానిమల్ వారియర్ టీం సోషల్ మీడియాలో కూడా ఉంచింది.