English | Telugu

భారతీయుడు 2 యుఎస్ రివ్యూ 

విశ్వ కధానాయకుడు కమల్ హాసన్(kamal haasan)ఇండియన్ గ్రేటెస్ట్ డైరెక్టర్ శంకర్(shankar)కాంబోలో 1996 లో వచ్చిన మూవీ భారతీయుడు. ఈ మూవీకి సీక్వెల్ గా భారతీయుడు 2(Bharateeyudu 2)ని ప్రకటించినప్పటి నుంచే వరల్డ్ వైడ్ గా ఉన్న సినీ ప్రేమికుల్లో మూవీ ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి ఏర్పడింది. ఈ రోజు వాళ్ళ ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్ సీస్ లో షోస్ కూడా పడ్డాయి. మరి అక్కడి టాక్ ఎలా ఉందో చూద్దాం.

మూవీ చూసిన చాలా మంది ప్రేక్షకుల దగ్గర నుంచి నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. కథ ప్రారంభం అయిన దగ్గర నుంచి చివరి దాకా చాలా బోరింగ్ గా సాగిందని, శంకర్ స్థాయి సినిమా కాదని చెప్తున్నారు. అసలు క్యారక్టర్ లు ఎటు వైపు వెళ్తున్నాయో కూడా తెలియని విధంగా స్క్రీన్ ప్లే సాగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ బాగోకపోయినా సెకండ్ ఆఫ్ అయినా బాగుంటుందేమో అని అనుకుంటే సెకండ్ మరి దారుణంగా ఉందని అంటున్నారు. అలాగే కమల్ హాసన్ మేకప్ కూడా బాగోలేదని,ఒక్కో చోట ఒక్కో రకంగా ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కాకపోతే ఆర్టిస్ట్ లు బాగానే పెర్ఫార్మ్ చేశారనే మాటలు వినిపిస్తున్నాయి. టోటల్ గా చెప్పాలంటే యుఎస్ రివ్యూ బాడ్ గానే ఉంది. మరి మన రివ్యూ ఎలా ఉందో చూడాలి మరి.

కమల్ హాసన్ తో పాటు సిద్దార్థ్, బాబీ సింహా, ఎస్ జే సూర్య, రకుల్ ప్రీత్, ప్రియా భవానీ శంకర్ వంటి వారు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. లైకా ప్రొడక్షన్స్ , రెడ్ జెయింట్ లు 250 కోట్ల భారీ బడ్జట్ తో నిర్మించాయి. అనిరుద్ సంగీతాన్ని అందించాడు.