English | Telugu

భారతీయుడు 2  ట్విట్టర్ రివ్యూ 

ఎట్టకేలకు కమల్ హాసన్(kamal haasan)శంకర్ (shankar)అభిమానుల కల ఈ రోజు ఫలించింది. వాళ్ళందరు సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న భారతీయుడు 2(bharateeyudu 2)ఈ రోజు వరల్డ్ వైడ్ గా ల్యాండ్ అయ్యింది. చాలా చోట్ల ఇప్పటికే షోస్ కూడా పడ్డాయి. ఈ నేపథ్యంలో ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందో చూద్దాం.

మూవీ చూసిన చాలా మంది కథ ఇప్పటి జనరేషన్ కి తగ్గట్టుగా లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.కథ స్టార్ట్ అవ్వడం బాగానే ఉన్నా కూడా క్రమ క్రమంగా ఇంపాక్ట్ తగ్గుతు వచ్చిందని అంటున్నారు. ముందుకు సాగిపోతున్న కొద్దీ.. ఏం జరుగుతుందో ఊహించుకునేలా ఉంది. నో గ్రిప్పింగ్, నో ఎగ్జైట్మెంట్ అని చెబుతున్నారు.టోటల్ గా ఫస్ట్ హాఫ్ యావరేజ్‌గా ఉందని, ఇక సెకండాఫ్ అయితే మరి దారుణం అనే మాటలు ఎక్కువ మంది నుంచి వినిపిస్తున్నాయి. శంకర్ కథని నడిపించే విధానం చాలా బోరింగ్ గా సాగిందని, సింపుల్గా చెప్పాలంటే అవుట్ డేటెడ్‌లా కనిపించిందని అంటున్నారు. కమల్, సిద్దు లు బాగానే చేసినా కూడా తక్కువ టైం కనపడ్డారని క్యారక్టర్ ల మధ్యన నడిచిన ఎమోషన్, డ్రామా వర్కౌట్ కాలేదంటున్నారు.

శంకర్ నుంచి వచ్చిన వరెస్ట్ సినిమా ఇదే అవుతుందని, మూడున్నర గంటలు వేస్ట్ చేసుకున్నామనే మాటలు ఎక్కువ మంది నుంచి వ్యక్తమవుతున్నాయి .ట్విట్టర్ లో ఇలా ఉంది. పూర్తి రివ్యూ బయటకు వస్తే గాని ఇది అబద్దమో నిజమో తెలియదు. లైకా ప్రొడక్షన్స్ , రెడ్ జెయింట్ సంస్థ కలిసి భారీ ఎత్తున నిర్మించింది. కమల్ హాసన్, సిద్దార్థ్ తో పాటు బాబీ సింహా, ఎస్ జే సూర్య, రకుల్ ప్రీత్, ప్రియా భవానీ శంకర్ వంటి వారు ప్రధాన పాత్రల్లో మెరిశారు. 1996 లో వచ్చిన భారతీయుడు కి సీక్వెల్ గా భారతీయుడు 2 వచ్చింది.