English | Telugu
ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్.. 'ఆర్ఆర్ఆర్'కి షాకిచ్చిన 'సీతారామం'!
Updated : Jul 11, 2024
2023 సంవత్సరానికి గాను సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ (68th Filmfare Awards South 2023)ను తాజాగా ప్రకటించారు. తెలుగు నుంచి 'ఆర్ఆర్ఆర్', 'సీతారామం' సినిమాలు ఎక్కువ అవార్డులను సొంతం చేసుకున్నాయి. జాతీయ, అంతర్జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన 'ఆర్ఆర్ఆర్'కి.. ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో 'సీతారామం' నుంచి గట్టి పోటీనే ఎదురైంది.
ఉత్తమ చిత్రం - ఆర్ఆర్ఆర్
ఉత్తమ దర్శకుడు - రాజమౌళి (ఆర్ఆర్ఆర్)
బెస్ట్ యాక్టర్ - ఎన్టీఆర్, రామ్ చరణ్ (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ సంగీత దర్శకుడు - ఎం.ఎం. కీరవాణి (ఆర్ఆర్ఆర్)
బెస్ట్ కొరియోగ్రఫీ - ప్రేమ్ రక్షిత్ (నాటు నాటు సాంగ్, ఆర్ఆర్ఆర్)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ - సాబు సిరిల్ (ఆర్ఆర్ఆర్)
బెస్ట్ సినిమాటోగ్రఫీ సెంథిల్ కుమార్ (ఆర్ఆర్ఆర్), రవి వర్మన్ (పొన్నియన్ సెల్వన్ 2)
బెస్ట్ మేల్ సింగర్ - కాలభైరవ (కొమురం భీముడో సాంగ్, ఆర్ఆర్ఆర్)
ఉత్తమ చిత్రం క్రిటిక్స్ - సీతారామం
ఉత్తమ నటుడు క్రిటిక్స్ - దుల్కర్ సల్మాన్ (సీతారామం)
ఉత్తమ నటి - మృణాల్ ఠాకూర్ (సీతారామం)
బెస్ట్ లిరిక్స్ - సిరివెన్నెల (కానున్న కళ్యాణం సాంగ్, సీతారామం)
బెస్ట్ ఫిమేల్ సింగర్ - చిన్మయి (ఓ ప్రేమ సాంగ్, సీతారామం)
ఉత్తమ నటి క్రిటిక్స్ - సాయి పల్లవి (విరాట పర్వం)
ఉత్తమ సహాయ నటి - నందితా దాస్ (విరాట పర్వం)
ఉత్తమ సహాయ నటుడు - రానా దగ్గుబాటి (భీమ్లా నాయక్)