English | Telugu
మురుగదాస్ ఆ విషయంలో దివ్యాంగుడా!.. వైరల్ అవుతున్న స్పీచ్
Updated : Jul 30, 2025
భారతీయ చిత్ర పరిశ్రమలో వైవిధ్యమైన కథల్నిప్రేక్షకులకి అందించే దర్శకుల్లో 'ఏఆర్ మురుగదాస్'(Ar Murugadoss)కూడా ఒకరు. గజనీ, 7th సెన్స్, స్టాలిన్, తుపాకీ, సర్కార్, కత్తి వంటి చిత్రాలే అందుకు ఉదాహరణ. ఈ ఏడాది 'సల్మాన్ ఖాన్'(Salman Khan)తో 'సికందర్'(Sikandar)అనే మూవీని తెరకెక్కించాడు. 'ఈద్'(Eid)కానుకగా' విడుదలైన సికందర్ సల్మాన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో 'శివకార్తికేయన్'(Sivakarthikeyan)తో 'మదరాసి'(Madarasi)అనే మరో వినూత్నమైన సబ్జెట్ ని తెరకెక్కిస్తున్నాడు.
ఈ మూవీకి సంబంధించి రీసెంట్ గా ఒక కార్యక్రమం జరిగింది. అందులో మురుగదాస్ మాట్లాడుతు' హిందీ చిత్రాలకి వర్క్ చేసే సమయంలో నేను దివ్యాంగుడిని. ఎందుకంటే సికందర్ కి సంబంధించి లాంగ్వేజ్ విషయంలో గందరగోళానికి గురయ్యాను. తెలుగులో కొంత వరకు పర్లేదు. హిందీలో మాత్రం నాకు ఏమి అర్ధం కాదు. నేను రాసుకున్న సీన్ పై నాకు అవగాహన ఉంటుంది. స్కిప్ట్ ఇవ్వగానే ఇంగ్లీష్ నుంచి హిందీకి అనువదించుకుంటారు. దీంతో షూట్ లో డైలాగుల విషయంలో గందరగోళం ఏర్పడుతుంది. నా మాతృభాష తమిళంలో సినిమాలు చెయ్యడం నాకు సులువు. ఇక్కడ వారికి ఏ కథ నచ్చుతుందో నాకు తెలుసు. సోషల్ మీడియాలో డైలాగులు, వైరల్ అయ్యే క్యాప్షన్స్ పై నాకు అవగాహన ఉండటంతో,యూత్ కి ఏం నచ్చుతుందో తెలుస్తుంది. ఇతర భాషల విషయంలో ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. నా స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే పై మాత్రమే ఆధారపడాలని చెప్పుకొచ్చాడు
ఇక 'మదరాసి'లో శివకార్తికేయన్ సరసన 'రుక్మిణి వసంత్'(Rukmini Vasanth)జత కడుతుండగా, విద్యుత్, బీజూ మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుద్(Anirudh Ravichander)సంగీత దర్శకుడు కాగా సెప్టెంబర్ 5 న పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదల కానుంది.