English | Telugu

అనుపమకి వేధింపులు.. ఆ పర్సన్ ఎవరో తెలిస్తే షాకవుతారు!

ఈ సోషల్ మీడియా యుగంలో సినీ సెలబ్రిటీలకు వేధింపులు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా హీరోయిన్లు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫొటో మార్ఫింగ్ లు, ఫేక్ న్యూస్ లతో చాలా ఇబ్బంది పడుతుంటారు. తాజాగా ప్రముఖ నటి అనుమప పరమేశ్వరన్ కి కూడా ఈ పరిస్థితి ఎదురైంది. అయితే దీని వెనుక ఎవరున్నారో తెలిసి ఆమె షాకైంది. (Anupama Parameswaran)

సోషల్ మీడియాలో తనకు వేధింపులు ఎదురయ్యాయంటూ తాజాగా అనుపమ ఓ పోస్ట్ పెట్టింది. "నా గురించి అసత్య ప్రచారం చేస్తున్న ఓ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ కొన్ని రోజుల క్రితం నా దృష్టికి వచ్చింది. మార్ఫింగ్ ఫొటోలు పోస్ట్ చేయడమే కాకుండా, నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు, నన్ను ద్వేషించడమే పనిగా ఆ పర్సన్ పలు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేశారు. ఈ ఆన్ లైన్ వేధింపులతో ఎంతో బాధపడ్డాను. ఈ విషయంపై నేను కేరళ సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాను. వారు వెంటనే స్పందించి, దీని వెనుక ఎవరున్నారో కనిపెట్టారు. తమిళనాడుకి చెందిన 20 ఏళ్ళ యువతి ఇదంతా చేస్తుందని తెలిసి ఆశ్చర్యపోయాను. ఆమెది చిన్న వయసు. అందుకే ఆమె భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకొని తన వివరాలు బయట పెట్టడంలేదు. నేను న్యాయపరంగానే ముందుకెళ్తా." అని అనుపమ రాసుకొచ్చింది.

ఆన్ లైన్ లో హీరోయిన్ కి వేధింపులు అంటే ఎవరో ఆకతాయి పని అనుకుంటాము. అలాంటిది ఓ 20 ఏళ్ళ యువతి ఇలా చేయడం అనుపమతో పాటు అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయమే.

అయితే ఇంత జరిగినా.. ఆ యువతి వివరాలు బయట పెట్టకుండా, న్యాయ పోరాటం చేస్తానని అనుపమ చెప్పడంపై ప్రశంసలు కురుస్తున్నాయి.