English | Telugu

ఆంధ్ర కింగ్ తాలూకాలో ప్రధాన హైలెట్స్ ఇవే.. ఈ హీరోనేనా ఆ ఆంధ్ర కింగ్ 

ఇస్మార్ట్ శంకర్ తో 'రామ్ పోతినేని'(Ram Pothineni)తన అభిమాన గణాన్ని, ప్రేక్షాభిమానాన్ని భారీగా పెంచుకున్నాడు. కానీ ఆ తర్వాత వచ్చిన రెడ్ ,ది వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ వంటి చిత్రాలతో విజయాన్న అందుకోలేకపోయాడు. దీంతో రామ్ కి హిట్ రావాలని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆంధ్ర కింగ్ తాలూకా(Andhra KIng Taluka)తో థియేటర్స్ లో అడుగుపెట్టాడు.ఉదయం 8 గంటలకే షోస్ ప్రారంభం కావడంతో అభిమానులతో పాటు మూవీ లవర్స్ భారీగానే థియేటర్స్ కి పోటెత్తారు.


వాళ్లంతా సోషల్ మీడియా వేదికగా 'ఆంధ్ర కింగ్ తాలూకా' పై స్పందిస్తు ఎంటైర్ మూవీ మొత్తానికి రామ్ పెర్ ఫార్మెన్స్ హైలెట్. లవర్ బాయ్ గా, హీరో కోసం తన ప్రేమని త్యాగం చేసే అభిమానిగా, పుట్టిన ఊరి కోసం పరితపించే యువకుడిగా రామ్ నటన సూపర్ గా ఉంది. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse)తో లవ్ సీన్స్ మెప్పించాయి. ఉపేంద్ర తో వచ్చిన క్లైమాక్స్ సీన్, వరదల్లో గ్రామం మునిగిపోయేటప్పుడు వచ్చే సీన్స్ అయితే సూపర్. ముఖ్యంగా కథ కూడా మరో ప్రధాన హైలెట్. క్లైమాక్స్ లోరామ్ ని ఉద్దేశించి ఉపేంద్ర(Upendra)మాట్లాడుతు 'నిజమైన ఆంధ్ర కింగ్ వి నువ్వే' అనడం థ్రిల్లింగ్ గా అనిపించిందని అభిమానులు,ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు.

రివ్యూస్ పరంగా చూసుకున్నా దాదాపుగా అన్ని మీడియా సంస్థలు పర్వాలేదనే రివ్యూస్ నే ఇస్తున్నాయి. దీంతో అభిమానులు హ్యాపీగా ఉన్నారు. మరి ముందు ముందు ప్రేక్షకుల టాక్ ఎలా ఉంటుందో, కలెక్షన్స్ ఏ విధంగా వస్తాయో చూడాలి. పి మహేష్ బాబు(P.Mahesh Babu)దర్శకత్వంలో అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సుమారు అరవై కోట్ల రూపాయిల బడ్జెట్ తో నిర్మించింది.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.