English | Telugu

Andhra King Taluka: ఆంధ్ర కింగ్ తాలూకా ట్విట్టర్ రివ్యూ.. అసలు ఊహించలేదు..!

థియేటర్లలో అడుగుపెట్టిన ఆంధ్ర కింగ్ తాలూకా
ప్రీమియర్స్ టాక్ ఎలా ఉంది?
రామ్ హిట్ కొట్టాడా?

అందరి హీరోల అభిమానులకు కనెక్ట్ అయ్యే స్టోరీతో అభిమాని బయోపిక్ గా రూపొందిన 'ఆంధ్ర కింగ్ తాలూకా' థియేటర్లలో అడుగుపెట్టింది. రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే, ఉపేంద్ర ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా నేడు(నవంబర్ 27) విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలు పూర్తయ్యాయి. ట్విట్టర్ లో ఈ మూవీ టాక్ ఎలా ఉందంటే..?

ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రానికి ట్విట్టర్ లో పాజిటివ్ రివ్యూలు కనిపిస్తున్నాయి. హీరో-అభిమాని ట్రాక్ ని, ప్రేమకథను బ్యాలెన్స్ చేస్తూ సినిమాని తెరకెక్కించిన తీరు బాగుంది అంటున్నారు. ముఖ్యంగా ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయని, కథని నిజాయితీగా చెప్పే ప్రయత్నం చేశారని ప్రశంసిస్తున్నారు. నిడివి ఎక్కువ ఉండి, అక్కడక్కడా నెమ్మదిగా సాగినట్టు అనిపించినప్పటికీ.. ఓవరాల్ గా ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా చూసిన అనుభూతి కలుగుతుందని చెబుతున్నారు. ఎమోషన్స్, నటీనటుల పెర్ఫార్మెన్స్, మ్యూజిక్, డైలాగ్స్ ప్రధాన బలంగా నిలిచాయని పలువురు ట్విట్టర్ లో రాసుకొస్తున్నారు.

Also Read: 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఫస్ట్ రివ్యూ!

ఆంధ్ర కింగ్ తాలూకాకు ట్విట్టర్ లో దాదాపుగా అన్నీ పాజిటివ్ రివ్యూలే కనిపిస్తున్నాయి. సినిమా ఇంత బాగుంటుందని అసలు ఊహించలేదని, ముఖ్యంగా క్లైమాక్స్ కోసమైనా ఈ సినిమా చూడొచ్చని అంటున్నారు.

ఇక రామ్ అభిమానులైతే.. తమ హీరో మాస్ ఊబి నుండి బయటకు వచ్చి, ఒక మంచి సినిమా చేశాడని.. ఎట్టకేలకు హిట్ కొట్టేశాడాని సంబర పడుతున్నారు.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.