English | Telugu

అలాంటి జర్నలిజం విలువలు ఇక్కడెప్పుడొస్తాయో?

అనసూయ ఈ మధ్య తరచూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తోంది. సోషల్ మీడియాలో ఆంటీ హాష్ టాగ్ తో ట్రోల్ అవుతూ ఉంటుంది. అలా ట్రోల్ చేసేవాళ్లకు ట్విట్టర్ వేదికగా గట్టిగా వార్నింగ్ లు కూడా ఆమె ఇస్తుంది. అలాంటి అనసూయ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఒక కామెంట్ పెట్టింది..."ఇలాంటి బాధ్యతాయుతమైన జర్నలిజం విలువలు ఇక్కడ ఎప్పుడు వస్తాయో" అని. దాని పైన ప్రియాంక చోప్రాకి జరిగిన రెడ్ కార్పెట్ ఇష్యూ ఫోటోని టాగ్ చేసింది. ఆ ఇష్యూ గురించి చెప్పుకోవాల్సి వస్తే హాలీవుడ్ ప్రాజెక్ట్ 'లవ్ అగైన్' ప్రొమోషన్స్ లో భాగంగా ప్రియాంక చోప్రా న్యూయార్క్ వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ అంతా ప్రెస్ వాళ్ళ హడావిడి ఎక్కువగా ఉంది. అలా ఆమె రెడ్ కార్పెట్ మీద నడుస్తూ ఉన్నప్పుడు ఫోటోగ్రాఫర్స్ ఆమెను ఫొటోస్ తీస్తున్నారు. ఆ టైంలో ఆమె వేసుకున్న హైహీల్స్ కారణంగా ఆమె కాలుజారి రెడ్ కార్పెట్ మీద కింద పడిపోయి చాలా ఇబ్బంది పడింది.

తనను ఆ యాంగిల్ లో ఫొటోస్ తీస్తున్నారేమో అని భయపడింది. కానీ ఫోటోగ్రాఫర్స్ అంతా ఆ ఇన్సిడెంట్ చూసి వాళ్ళ వాళ్ళ కెమేరాస్ ని కిందకి దించేశారు..కంగారు పడకండి జాగ్రత్తగా నిలబడండి అంటూ ఆమెను లేపి నిలబెట్టారు..ఇదంతా మనకు తెలుసు. ఈ విషయానికి సంబంధించి ఆమె ఒక ఛానల్ ఇంటర్వ్యూలో చెప్తూ " నా 23 ఏళ్ళ కెరీర్ లో ఇలాంటి సంఘటన నేనస్సలు చూడనే లేదు. సంతోషంగా కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు నేను కిందపడిపోయినట్టుగా ఉన్న ఒక్క క్లిప్ కానీ ఫోటో కానీ బయటకు రాలేదు" అని హ్యాపీ ఫేస్ తో చెప్పింది. ఇదే విషయాన్ని అనసూయ మెన్షన్ చేస్తూ మన దగ్గర అలాంటి జర్నలిజం విలువలు లేవు అని ఇండైరెక్ట్ గా చెప్పింది. ఇక్కడ ఏ చిన్న మాట మాట్లాడిన ఏ చిన్న కామెంట్ పెట్టిన దాన్ని చిలువలు పలువులు చేసి ట్రోల్ చేస్తారు అని చెప్పకనే చెప్పింది అనసూయ.