English | Telugu
వైరల్ గా మారిన ప్రియాంక సింగ్ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్!
Updated : May 13, 2023
ప్రియాంక సింగ్.. ఇప్పుడు పరిచయం అక్కర్లేని సెలబ్రిటీ. జబర్దస్త్ తో కెరీర్ స్టార్ట్ చేసి బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక సింగ్.. బిగ్ బాస్ తో మంచి ఫేమ్ సంపాదించుకుంది. తనని అభిమానులు ముద్దుగా పింకీ అని పిలుస్తారు. బిగ్ బాస్ లో తను అచ్చం తెలుగింటి ఆడపడుచులాగా ఉండేది. తన తీరు అందరికి నచ్చడంతో చాలా మంది ప్రేక్షకులు తనకి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. బిగ్ బాస్ నుండి వచ్చాక ప్రియాంక సింగ్ వరుస ఆఫర్స్ తో బిజీ లైఫ్ ని గడుపుతుంది. బిగ్ బాస్ తర్వాత క్రేజ్ పెరిగిందని కాబోలు ఈ అమ్మడు తన రూట్ మార్చింది. సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ తో పిచ్చెక్కిస్తుంది. అది చూసిన నెటిజన్లు మండిపడుతూ కామెంట్లు చేస్తున్నారు.
తాజాగా ప్రియాంక తన ఇన్ స్టాగ్రామ్ లో.. ఇట్స్ నాట్ ఏ బోల్డ్ గుర్తు పెట్టుకోండి అంటూ తన హాట్ ఫోటోని షేర్ చేసిన విషయం తెలిసిందే. అలా నేనొక ఆర్టిస్ట్ ని అని నెటిజన్లకి చురుకలు అంటించిన విషయం తెలిసిందే. ప్రియాంక సింగ్ తన ఇన్ స్టాగ్రామ్ లో కాసేపు మాట్లాడుకుందామా అంటూ పోస్ట్ చెయ్యగా.... తనని కొందరు విచిత్రమైన ప్రశ్నలు అడిగారు. అలా అడిగిన వారిలో కొందరికి స్వీట్ గా, మరికొందరికి ఘాటుగా సమాధానమిచ్చింది ప్రియాంక. మీ ప్రొఫైల్ లో పోస్ట్ లు చూసాక మీ మీద ఉన్న రెస్పెక్ట్ మొత్తం పోయిందని ఒకరు అనగా... దట్స్ యువర్ ప్రాబ్లమ్, థాంక్యూ అండ్ నా ప్రొఫైల్ కాకుండా వేరే ఆర్టిస్ట్ ప్రొఫైల్ చూసి రియలైజ్ అయ్యాక, నా పోస్ట్ కి రిప్లై ఇవ్వు.. నా హార్డ్ వర్క్ ని చూడాలి గాని నా డ్రెస్ సెన్స్ కాదు కిడ్డో అని ఘాటుగానే జవాబిచ్చింది ప్రియాంక. మీ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటని ఒకరు అడుగగా.. అందరు స్టార్ డైరెక్టర్ తో నా ప్రాజెక్ట్స్.. కానీ ముందు వాళ్ళు రివీల్ చెయ్యకుండా నేను రివీల్ చెయ్యడం కరెక్ట్ కాదు.. ఇంకా పాన్ ఇండియా మూవీస్ లో లీడ్ రోల్ లో మీ ముందుకు వస్తున్నా దానికి సంబంధించినవి త్వరలోనే చెప్తానని ప్రియాంక చెప్పింది.
కెన్ ఐ హ్యావ్ డేట్ విత్ యూ.. అండ్ హౌ మచ్ కాస్ట్ ఫర్ నైట్ అని ఒకరు అడుగగా.. నాకు ఇలాంటి విషయాల్లో అంతగా అనుభవం లేదు కానీ ఖచ్చితంగా డేట్ చేద్దాం.. ఒకసారి మీ డాడ్ దగ్గరికి వెళ్ళి అడుగు.. ఫస్ట్ టైం మమ్మీ తో డేట్ కి వెళ్ళినప్పుడు.. మమ్మీకి నువ్వు ఎంత పే చేసావ్ డాడ్ అని అడుగు.. నేను కూడా ప్రియాంక సింగ్ దగ్గరికి డేట్ కి వెళ్తున్నానని చెప్పమని అడుగు అని ప్రియాంక బోల్డ్ రిప్లై ఇచ్చింది. నువ్వు చాలా మందికి ఇన్స్పిరేషన్ అని కాంప్లిమెంట్ ఇవ్వగా.. ప్రియాంక కూల్ గా రిప్లై ఇచ్చింది. మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని ఒకరు అడుగగా.. పెళ్ళి చేసుకోవాలని లేదని సమాధానమిచ్చింది ప్రియాంక సింగ్. ఇలా అభిమానులు అడిగిన ప్రశ్నలకి ఓపికగా చెప్పుకొచ్చింది ప్రియాంక సింగ్.